దాదాపు 70 ఏళ్ల తర్వాత చిరుత పులులు భారత్లో కనిపించనున్నాయి. ఈ మేరకు దక్షిణాఫ్రికా నుంచి చిరుతలను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ).
మధ్యప్రదేశ్లోని కునో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోకి ఈ చిరుతలను తరలించనున్నట్లు ఎన్టీసీఏ పేర్కొంది. ఆగస్టు కల్లా చిరుత సంరక్షణకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని అటవీ శాఖ అధికారులను సూచించినట్లు తెలిపింది. మొదటి బ్యాచ్ చిరుతలను నవంబర్ కల్లా స్వదేశానికి తీసుకురానున్నట్లు వెల్లడించింది.
14 చిరుతలు..