తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Delta variant: డెల్టా జోరుకు ఇవే కారణాలు..

యాంటీబాడీలను ఏమార్చే సామర్థ్యం, అధిక సాంక్రమిక శక్తి కారణంగా డెల్టా వేరియంట్​ ఉద్ధృతి పెరిగినట్లు (Delta variant) అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తేల్చింది. ఇతర వేరియంట్ల కన్నా ఇది వేగంగా ఇతరులకు వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు.

delta variant in india
డెల్టా జోరుకు ఇవే కారణాలు

By

Published : Sep 8, 2021, 5:23 AM IST

Updated : Sep 8, 2021, 6:33 AM IST

భారత్​ సహా అనేక దేశాల్లో వెలుగు చూసిన కరోనా కేసుల్లో సింహభాగాన్ని ఆక్రమించిన డెల్టా వేరియంట్​కు (Delta variant) నిర్దిష్టంగా ఈ జోరు ఎక్కడి నుంచి వచ్చిందన్నది శాస్త్రవేత్తలు నిర్ధరించారు. యాంటీబాడీలను ఏమార్చే సామర్థ్యం, అధిక సాంక్రమిక శక్తి కారణంగా దీని ఉద్ధృతి పెరిగినట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తేల్చింది. ల్యాబ్​లో ప్రయోగాలు నిర్వహించడం సహా టీకా పొందాక కూడా ఇన్​ఫెక్షన్ బారినపడిన వారి తీరుతెన్నులను పరిశీలించింది. ఇందుకోసం గతంలో కరోనా బారినపడటం లేదా ఆస్ట్రాజెనెకా/ఫైజర్​ టీకాలను పొందిన వ్యక్తుల నుంచి సేకరించిన సీరంను పరిశోధకులు పరిశీలించారు. ఇందులో యాంటీబాడీలు ఉంటాయి. డెల్టా వేరియంట్​పై(Delta variant in India).. మునుపటి ఇన్​ఫెక్షన్ వల్ల కలిగిన యాంటీబాడీలు 5.7 రెట్లు తక్కువగా, టీకా వల్ల ఉత్పత్తయిన యాంటీబాడీలు 8 రెట్లు తక్కువగా సున్నితత్వాన్ని చూపాయని శాస్త్రవేత్తలు వివరించారు.

వ్యక్తుల్లో ప్రస్తుతమున్న రోగ నిరోధక రక్షణను ఏమార్చడంలో డెల్టా వేరియంట్​ (Delta variant) సమర్థతను చాటుతున్నట్లు ఈ పరిశోధనలో పాల్గొన్న పార్థారక్షిత్ చెప్పారు. శరీరంలోకి ప్రవేశించాక ఈ రకం వైరస్​ చాలా వేగంగా తన ప్రతులను పెంచుకుంటున్నట్లు కూడా తేల్చారు. ఇతర వేరియంట్ల కన్నా ఇది వేగంగా ఇతరులకు వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. 'భారత్​లో కొవిడ్​ రెండో ఉద్ధృతికి ఈ అంశాలు కారణమై ఉండొచ్చు. ఆ సమయంలో వెలుగు చూసినవాటిలో సగం కేసులు.. అంతకుముందు ఇతర వేరియంట్లతో ఇన్​ఫెక్ట్​ అయినవారే' అని బ్రిటన్​లోని కేంబ్రిడ్జ్​ విశ్వవిద్యాలయానికి చెందిన రవీంద్ర గుప్తా పేర్కొన్నారు.

ఇదీ చూడండి :Nipah Virus: కేరళలో 'నిఫా' అలర్ట్- వారందరికీ నెగెటివ్

Last Updated : Sep 8, 2021, 6:33 AM IST

ABOUT THE AUTHOR

...view details