తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొవాగ్జిన్‌తో 6 నెలల పాటు రోగనిరోధక జ్ఞాపకశక్తి'

కొవాగ్జిన్ టీకా తీసుకుంటే కొవిడ్‌-19 కారక సార్స్‌కోవ్‌-2 వైరస్‌కు సంబంధించిన రోగనిరోధక జ్ఞాపకశక్తి కనీసం ఆరు నెలల వరకు ఉంటున్నట్లు ఎన్‌ఐఐ డైరెక్టర్‌ పుష్కర్‌శర్మ తెలిపారు. అందువల్ల ఈ టీకా నుంచి కనీసం ఆరు నెలల వరకు రక్షణ లభిస్తుందన్నారు.

Covaxin has cellular immune memory to Covid for at least 6 months
'కొవాగ్జిన్‌తో 6 నెలల పాటు రోగనిరోధక జ్ఞాపకశక్తి'

By

Published : Nov 16, 2021, 7:06 AM IST

భారత్​ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా తీసుకున్నవారి యాంటీబాడీస్​లో కొవిడ్‌-19 కారక సార్స్‌కోవ్‌-2 వైరస్‌కు సంబంధించిన రోగనిరోధక జ్ఞాపకశక్తి ఆరు నెలల వరకు ఉంటున్నట్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీ (ఎన్‌ఐఐ) డైరెక్టర్‌ పుష్కర్‌శర్మ తెలిపారు. అందువల్ల ఆ టీకా నుంచి కనీసం ఆరు నెలల వరకు రక్షణ లభిస్తుందని చెప్పారు. ఆదివారం కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ అధ్యక్షతన జరిగిన ఎన్‌ఐఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో పుష్కర్‌శర్మ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్‌ వేరియంట్లైన డెల్టా, ఆల్ఫా, బీటా, గామాలకు సంబంధించి కూడా కొవాగ్జిన్‌ టీకా కణసంబంధ జ్ఞాపకశక్తిని కలిగి ఉందని, అది ఆరు నెలల వరకు కొనసాగుతుందని స్పష్టంచేశారు.

గతంలో ఎదుర్కొన్న రోగ కారకాలను గుర్తించగానే రోగనిరోధక వ్యవస్థ వేగంగా, సమర్థంగా స్పందించే సామర్థ్యమే రోగనిరోధక జ్ఞాపకశక్తి.

ఇదీ చదవండి:ఐటీ దాడుల్లో రూ.600 కోట్ల నల్లధనం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details