తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భర్త చేష్టలతో విసిగి.. మర్మాంగాన్ని కోసిన భార్య - ఉత్తర్​ప్రదేశ్​ వైరల్ న్యూస్

మూడో పెళ్లి చేసుకునేందుకు హింసిస్తున్న భర్త మర్మాంగాన్ని కోసి హత్య చేసిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది. తన భర్త పెట్టే హింస భరించలేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది ఆ మహిళ.

wife cut private part of her husband and killed in muzaffarnagar
భర్త చేష్టలతో విసిగి.. మర్మాంగాన్ని కోసిన భార్య

By

Published : Jun 25, 2021, 2:33 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ముజఫర్​నగర్ జిల్లాలో సంచలన ఘటన జరిగింది. మూడో పెళ్లికి సిద్ధమైన భర్త మర్మాంగాన్ని కోసేసింది ఓ మహిళ. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. మృతుడు భౌరా ఖుర్ద్ గ్రామ మసీదులో మత గురువుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

తన భర్త మూడో వివాహం చేసుకునే ఉద్దేశంతో తనతో రోజూ గొడవ పడుతుంటాడని.. అతని చేష్టలతో విసిగిపోయి హతమార్చానని ఆమె పేర్కొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భౌరా కాలన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మహిళను అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. మృతుడి మర్మాంగానికి తీవ్ర గాయం కావడంతోనే మరణించాడని.. శరీరంలో తీవ్రమైన గాయాలు సైతం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తొలుత అనుమానాస్పద మృతిగా పరిగణించిన పోలీసులు.. మృతుని భార్యను తమదైన శైలిలో విచారించగా.. ఆమె నేరాన్ని ఒప్పుకున్నారు.

"నా భర్తకు నేను రెండో భార్యను. మాకు ఐదుగురు కుమార్తెలు. ఇప్పుడు మూడో వివాహానికి సిద్ధమయ్యాడు. నేను ఒప్పుకోక పోవడంతో తరచూ కొట్టేవాడు. నా పెద్ద కుమార్తెనే వివాహం చేసుకోవాలని చూశాడు."

-పోలీసుల విచారణలో నిందితురాలు

రోజూ గొడవలు, తగాదాలతో విసిగిపోయిన ఆమె.. బుధవారం రాత్రి నిద్రపోతున్న తన భర్త మర్మాంగం భాగంలో కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసినట్లు భౌరా కాలన్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి జితేంద్ర సింగ్ తెవాటియా తెలిపారు.

ఇవీ చదవండి:భర్తను చంపి ముక్కలుగా నరికి.. సంచిలో!

మొదటి రాత్రే భార్యను చంపి భర్త ఆత్మహత్య!

ABOUT THE AUTHOR

...view details