102 ఏళ్ల మర్రిచెట్టుకు ఘనంగా పుట్టినరోజు వేడుకలు వృక్షాల ప్రాముఖ్యతను గుర్తిస్తూ 102 ఏళ్ల మర్రి చెట్టుకు పుట్టినరోజు వేడుకలను చేశారు తమిళనాడులోని రామనాథపురం జిల్లా మీనాక్షిపురం వాసులు. చిన్నప్పటి నుంచి చెట్లు తమ జీవితంగా భాగంగా ఉన్నాయని, వాటిని సంరక్షించుకోవడం అందరి బాధ్యత అని వారు చాటిచెబుతున్నారు.
వందేళ్ల మర్రిచెట్టు వద్ద స్థానికులు ఒక్కటే మిగిలింది..
సేలూర్కు దగ్గర్లో ఉన్న ఈ గ్రామంలో ఏడు కన్నా ఎక్కువ మర్రి చెట్లు ఉండేవట. వాటిని సంరక్షించుకోవడంలో విఫలమైనందున అంతరించిపోతూ వచ్చాయి. ఒక్కటి మాత్రమే దశాబ్దాల తరబడి గంభీరంగా నిలబడి ఉంది.
మర్రిచెట్టుకు పుట్టినరోజు కృతజ్ఞతగానే..
చెట్లకు కృతజ్ఞత చాటడానికి స్థానికులు, సామాజిక కార్యకర్తలు ఆదివారం వినూత్న పండుగ నిర్వహించారు. కేకు కట్ చేసి పుట్టినరోజు వేడుక చేశారు.
కేకు కట్ చేస్తున్న నిర్వాహకులు ఈ సందర్భంగా చిన్నారులతో మొక్కలు నాటించిన గ్రామస్థులు.. స్థానిక వృక్షాలను రక్షించుకోవాలని సూచించారు. చెట్ల అవసరం ప్రాముఖ్యతపై భవిష్యత్ తరాలకు తెలియజేయడానికి ఈ పండుగను ఏటా జరిపిస్తామని ఓ నిర్వాహకుడు తెలిపారు. వీటివల్ల సానుకూల మార్పు ఏర్పడుతుందని చెప్పారు.
ఇదీ చూడండి:World Environment Day: చెట్లు నాటితేనే మానవాళికి 'ఊపిరి'