ఉత్తరాఖండ్ లఖ్సర్లో భారీ వర్షాలతో బాణగంగా నది కట్ట తెగి 20 గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. అంతేగాకుండా చాలా మంది రైతులు పొలాల్లో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు స్థానిక అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. సహాయక చర్యలను ప్రారంభించింది. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరి కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
బాణగంగా నది కట్ట తెగిందని మాకు సమాచారం అందింది. దీంతో వెంటనే సహాయక బృందాలను తీసుకుని ఘటనా స్థలికి వచ్చాము. వరదల్లో చిక్కుకున్న 30 మందిని సిబ్బంది రక్షించారు. పై నుంచి వస్తున్న వరదతో ఎక్కువ మంది నీటిలో చిక్కుకుపోతారని ప్రజలు భయపడుతున్నారు.