తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎయిర్​పోర్టులో కలకలం- ఒకేసారి ఆరు తుపాకులతో... - బొమ్మ తుపాకులు

అంతర్జాతీయ విమానాశ్రయంలో తుపాకులు కలకలం సృష్టించాయి. అయితే అవి సినిమా షూటింగ్​ కోసం తెప్పించిన డమ్మీవని అధికారులు గుర్తించారు.

బెంగళూరు
Bengaluru news

By

Published : Jul 30, 2021, 3:44 PM IST

కర్ణాటక బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తుపాకులు కలకలం సృష్టించాయి. టర్కీ నుంచి శుక్రవారం వచ్చిన ఓ అనుమానాస్పద పార్శిల్​ను కస్టమ్స్​ అధికారులు పరిశీలించారు. అందులో కొన్ని తుపాకులు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమై దర్యాప్తు చేయగా అవి సెమీ ఆటోమెటిక్​ డమ్మీ గన్​లని తేలింది. ఈ తుపాకులను ఓ సినిమా షూటింగ్​ కోసం టర్కీ నుంచి తెప్పించినట్లు తెలుసుకున్నారు.

కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్న తుపాకులు

ఓ భారీ బడ్జెట్​ సినిమా చిత్రీకరణ కోసం వాటిని విదేశాల నుంచి కన్నడ నిర్మాతలు ఆర్డర్​ చేశారని అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్​ డీసీపీ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత వాటిని నిర్మాతలకు అందజేస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి:అంతర్జాతీయ విమానాలపై మరోసారి నిషేధం పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details