తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జొమాటో బాక్స్​లో బీర్​ బాటిళ్లు.. డెలివరీ బాయ్​ అరెస్ట్​ - జొమాటో డెలివరీ బాయ్​

ఫుడ్​ డెలివరీ చేయాల్సిన జొమాటో ఉద్యోగి బీర్​ బాటిళ్లను సరఫరా చేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన చెన్నైలో జరిగింది.

Zomato employee arrested
జొమాటో బాక్స్​లో బీర్​ బాటిళ్లు

By

Published : May 27, 2021, 4:45 PM IST

జొమాటో డెలివరీ బాయ్..​ బీర్​ బాటిళ్లను సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కిన ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. నగరంలోని కేజీ రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానంగా కనిపించిన జొమాటో డెలివరీ బాయ్​ వాహనాన్ని చెక్​ చేశారు. దీంతో ఫుడ్​ ఉండాల్సిన జొమాటో బాక్స్​లో బీర్​ బాటిళ్లు దర్శనమిచ్చాయి.

కోడంబక్కంకు చెందిన ప్రసన్న వెంకటేశ్​(32)గా నిందితున్ని గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details