ఓ కేసులో భాగంగా పోలీసులు పదే పదే విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేస్తుంటే మనస్తాపం చెందాడు ఆ యువకుడు. పోలీస్ స్టేషన్ ఎదుటే బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం జరిగిందీ ఘటన.
ఏం జరిగింది..

తమిళనాడులో చెన్నై శోలింగ్నల్లూర్లోని లాల్ బహదూర్ శాస్త్రి కాలనీకి చెందిన సతీశ్ కుమార్ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ.. స్థానికంగా ఉండే ఓ యువతి సెమ్మనచెరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తులో భాగంగా పోలీసులు.. సతీశ్‌ను పలుమార్లు స్టేషన్‌కు పిలిపించారు. విచారణను తట్టుకోలేకపోయిన సతీశ్.. పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి అటుగా వెళ్తున్న బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు.. మృతదేహాన్ని పంచనామాకు తరలించారు.
ఇదీ జరిగింది :పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. 3 నెలల్లో 5188