Rajasthan HC: రాజస్థాన్ హైకోర్టులో అరుదైన ఘటన జరిగింది. తొలిసారి భార్యాభర్తలు న్యాయమూర్తులుగా సేవలందించనున్నారు. కేంద్ర న్యాయశాఖ శుక్రవారం జస్టిస్ కుల్దీప్ మథూర్, జస్టిస్ శుభా మెహ్తాలను రాజస్థాన్ హైకోర్టు జడ్జీలుగా నియమించింది. అయితే జస్టిస్ శుభా మెహ్తా భర్త జస్టిస్ మహేంద్ర గోయల్ ఇప్పటికే ఈ హైకోర్టులోనే జడ్జిగా ఉన్నారు. దీంతో ఇకపై ఇద్దరు ఒకే కోర్టులో న్యాయమూర్తులుగా ఉండనున్నారు. కొత్తగా నియమించిన ఇద్దరు జడ్జిలతో కలిపి రాజస్థాన్ హైకోర్టులోని న్యాయమూర్తుల సంఖ్య 25 నుంచి 27కు పెరిగింది. మొత్తం జడ్జిల సంఖ్య 50 కాగా.. ఇంకా 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
హైకోర్టు న్యాయమూర్తులుగా భార్యాభర్తలు.. అక్కడ తొలిసారి
Judge couple: రాజస్థాన్ హైకోర్టులో తొలిసారి భార్యాభర్తలిద్దరూ న్యాయమూర్తులుగా సేవలందించనున్నారు. జస్టిస్ మహేంద్ర గోయల్ ఇప్పటికే ఈ హైకోర్టులో జడ్జిగా ఉండగా.. ఆయన సతీమణి జస్టిస్ శుభా మెహ్తాను కొత్త జడ్జిగా నియమించింది కేంద్ర న్యాయశాఖ.
హైకోర్టు న్యాయమూర్తులుగా భార్యాభర్తలు.. అక్కడ తొలిసారి
2020 డిసెంబర్లో మద్రాసు హైకోర్టులోనూ జస్టిస్ మురళీశంకర్ కొప్పురాజుతో పాటు ఆయన భార్య జస్టిస్ తమిళ్సెల్వి టీ వలయపాలయమాండ్ ఒకేసారి న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2019 నవంబర్లోనూ పంజాబ్ హైకోర్టు జడ్జిలుగా జస్టిస్ వివేక్ పూరి, ఆయన సతీమణి జస్టిస్ అర్చన పూరి ఒకే రోజు ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు రాజస్థాన్లోనూ భార్యాభర్తలు జడ్జీలుగా ఉన్నారు.
ఇదీ చదవండి:మైనారిటీ చట్టం నిబంధనలు సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్