తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే నినాదం - ఓటు వేద్దాం - ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం

Importance of Voting in Telangana 2023 : ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న నినాదం. ఎన్నికల సంఘం అధికారులతో పాటు, స్వచ్ఛంద సంస్థలు, సుపరిపాలన వేదిక ఇలా ఎంతో మంది ఓటు విలువ చాటిచెబుతున్నారు. ఇదే విషయమై ఎన్నోచోట్ల ప్రచార బోర్డులు వెలుస్తున్నాయి. మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే భవిత.. లేదంటే అంధకారం అని అవగాహన కల్పిస్తున్నారు. నీ సత్తా నిరూపించుకునే సమయం వచ్చినప్పుడు మిన్నకుండి తదనంతరం నిందించే కన్నా.. ముందే మేల్కోవాలని సూచిస్తున్నారు. మంచి చేస్తారనే నాయకుడికే పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Vote Importance
Importance of Voting in Telangana 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 9:24 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే నినాదం - ఓటు వేద్దాం - ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం

Importance of Voting in Telangana 2023 :సమాజంలో మార్పుతో కూడిన అభివృద్ధి సాధించాలంటే పౌరులు యుద్ధాలు, త్యాగాలు చేయాల్సిన అవసరంలేదు. చేయాల్సిందల్లా కేవలం.. పోలింగ్ రోజు నీకున్న హక్కు సద్వినియోగం చేసుకోవడమే. నీ కర్తవ్యం నెరవేర్చాల్సిన రోజున బాధ్యరాహిత్యంగా వ్యవహరిస్తే.. సమాజమే కాదు... దేశం(Country) కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇలాంటి విషయాలపై ఎన్నికల వేళ ఇబ్బడిముబ్బడిగా కొన్ని సందేశాలు వైరల్‌గా మారాయి. మార్పుకోసం సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.

I Vote For Sure : "ఎవరు మారాలి.. ఎందుకు మారాలి.. మార్పు గురించి.. ఎక్కడైనా ఎవరైనా చెబితే అంతా చేసేద్దాం అనేంత ఉత్సాహం వస్తుంది. కానీ చేయం. ఎందుకు అంటే అలసత్వం. చాలా మందికి వాయిదాలు(Deferrals) వేసుకుంటే పోయే ఒక దురలవాటు ఉంటుంది. కొన్నివిషయాల్లో వాయిదాలు కలిసివచ్చినా.. కొన్నిచోట్ల మంచిది కాదు. అలాంటి వాటిలో ఓటు.. ముందువరుసలో ఉంటుంది.

ఓట్ల పండుగకు రాష్ట్రం ముస్తాబు - పోలింగ్‌ కోసం సర్వం సిద్ధం

ఉదాహరణకు ఒక వ్యక్తి 60 ఏళ్లు జీవిస్తాడు అనుకుంటే ఐదేళ్లకోమారు వేసే ఓటును కేవలం 8 సార్లు మాత్రమే వినియోగించుకోగలడు. ఈ 8 సార్లు తను తీసుకునే నిర్ణయంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 6దశాబ్దాల జీవితకాలంలో అత్యంత తక్కువ సార్లు వచ్చే ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరి విధి.

భారతదేశ భవితకు కీలకమైనది ఓటుహక్కు : దేశం గురించి ఆలోచన చేసే ప్రతిఒక్కరూ నేను మారాలి అని ముందడుగువేస్తే సమాజం(Society) బాగుపడుతుంది. ఆ మార్పు అనేది.. ముందు నీతో ప్రారంభం కావాలి. మరి దేశం బాగుపడాలంటే పాలించే నాయకులు.. మంచి వారై ఉండాలి. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే.. ఓటరు దేవుడు సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే. కీలకమైన ఈ విషయం దగ్గరకు వచ్చేసరికి ఎన్నో అడ్డుగోడలు ఎదురొచ్చి జనం.. దేశాభివృద్ధిని కాలరాస్తున్నారు.

కొందరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి వారివల్లే ఎంతో మంది అవినీతిపరులైన(Corrupt leaders) నేతలు.. గద్దెనెక్కి రాష్ట్రాలు, దేశాన్ని పాలిస్తున్నారు. నాయకుడిగా.. ఎవరిని ఎన్నుకుంటున్నాం? ఎందుకు ఎన్నుకుంటున్నాం? ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటున్నామో కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్వార్థ పూరితమైన సమాజంలో నిస్వార్థపరుడైన నాయకుడిని ఎందుకు ఎన్నుకోలేక పోతున్నామో ఎవరి అంతరాత్మను వారు ప్రశ్నించుకోవాలి.

Right to Vote : ఓటుకు విలువ కట్టి అసమర్థులను, దోపిడీదారులను ఎన్నుకుంటే సమాజం భవితవ్యం ఏంటనేది అందరూ ఆలోచించాల్సిన విషయం. అవినీతి, అక్రమాలు, అన్యాయం రాజ్యమేలుతున్న ప్రస్తుత సమాజంలో మార్పు అనేది తప్పక రావాలి. ఆ మార్పు మంచి నాయకుడిని ఎన్నుకున్నప్పుడే సాధ్యం అవుతుంది.

ఉదయం ఐదున్నరకే మాక్ పోలింగ్ - 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం

ఒక ప్రాంతంలో అవినీతి పరుడైన నాయకుడు పదవిలో ఉన్నాడంటే కారణం ఓటరు. అవును.. కేవలం ఓటరు మాత్రమే. ఎందుకంటే ఆయన కూడా స్వార్థపరుడు కాబట్టి. స్వార్థం కోసమే ఓటు వేస్తున్నారు. మందు, డబ్బు, చీర, జాకెట్లు, బంగారం(Gold Material), వెండి వంటి వస్తువులకు ఆశపడి కొందరు ఓటేస్తున్నారు. ప్రలోభాలకు తలొగ్గి ఎంతో అమూల్యమైన ఓటును 5 ఏళ్లకు సంతలో సరకులా బేరం పెడుతున్నారు.

Lets Vote For Future :ఇంకొందరు.. కులం, మతం, ప్రాంతం చూసి ఓటేస్తున్నారు. అంతేగాని మంచి నాయకుడిని ఎన్నుకుంటే మనకు మంచి చేస్తాడని ఏ ఒక్కరు ఆలోచించడం లేదు. ఈ తరహా ఆలోచన ధోరణి మారినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. ప్రస్తుతం ఎన్నికలు, ప్రలోభాలు(Temptations) పర్యాయపదాలుగా మారిపోయాయి. ఓటర్లకు డబ్బులు ఎరవేస్తున్న నాయకుల్లో గెలిచిన వారు.. తదుపరి ఐదేళ్లు ప్రజల ముఖం కూడా చూడరు.

ఓటు వేసేందుకు సొంతూళ్ల బాట పట్టిన ఓటర్లు - కిటకిటలాడుతున్న బస్టాండ్‌ పరిసరాలు

ఈ పరిస్థితులు పారదోలాలంటూ ఎన్నికల సంఘం విభిన్నంగా అవగాహన కల్పిస్తోంది. ఓటర్లరా.. ఒక్క విషయం ఆలోచించండి అంటున్న ఈ అక్షరాలు.. ఓటును అమ్ముకోవద్దని సూచిస్తున్నాయి. రోజుకు 27 పైసలకు ఓటును అమ్ముకుని బిచ్చగాడి కంటే కూడా హీనంగా మారొద్దని నిత్యం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు విన్నవిస్తున్నాయి. డబ్బు, మందు వంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరుతున్నాయి.

ఓటే నీ ఆయుధం.. విడువకు నీ బ్రహ్మాస్త్రం :దేశ భవిష్యత్తును(Country Future) నిర్ణయించే శక్తి ఒక్క ఓటరుకు మాత్రమే ఉంటుంది. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును బాధ్యత గల పౌరులు విధిగా వినియోగించుకోవాలి. ఓటుహక్కును అస్తిత్వ చిహ్నంగా భావిస్తున్న అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో వికిసిస్తున్న ప్రజాచైతన్యమే అందుకు నిదర్శనం. సమర్థుల చేతుల మీదుగా పాలన, ప్రణాళికల రూపకల్పన సాగేందుకు దోహదపడటంలో పౌరులు తమ ధర్మాన్ని కచ్చితంగా నిర్వహించాలి. అప్పుడే అభివృద్ధి సుసాధ్యం అవుతుంది.

భారతదేశంలో గణనీయసంఖ్యలో ఓటర్లు సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కాకపోవడం ఎంత అనర్థమో గతంలోనే మాజీ ఎన్నికల కమిషనర్‌ శేషన్‌ హెచ్చరించారు. మంచివాళ్లు ఓటింగ్‌కు దూరంగా ఉండటం చెడ్డ ప్రభుత్వాల ఏర్పాటుకు దారి తీస్తుందని ఆయన చెప్పింది అక్షరసత్యం. దేశంలో 65 శాతానికిపైగా జనాభా 35ఏళ్లలోపు వయసువారేనని గణంకాలు చాటుతున్నాయి.

మీకు "ఓటర్​ స్లిప్​" ఇంకా అందలేదా? ఇలా సింపుల్​గా అందుకోండి!

Vote Slogan Heard Across the State : ప్రస్తుత, భావితరాల భవిష్యత్తును(Future Generation) నిర్దేశించగల బలమైన శక్తి ఓటుహక్కు రూపేణా తమకు ఉన్నా.. ఆచితూచి ఉపయోగించుకోవడంలో నిర్లక్ష్యం ఎంత మాత్రం మంచిది కాదు. రాష్ట్రం, దేశం మావి.. దిశానిర్దేశం మాదేనంటూ ముఖ్యంగా యువ ఓటర్లు చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరముంది. ఒక్క యువతే కాదు.

దేశంలో, రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించినవారు ఎంతోమంది ఉన్నారు. బలమైన ప్రజాస్వామ్యం ఉంది. ప్రభుత్వాలు ఉన్నాయి. పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఉన్నాయి. వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, నటీనటులు, కార్మికులు, ఇలా ఎంతో మంది మేధావులు ఉన్నారు. ఎన్ని చదువులు చదివినా, ఎంత సంపాదించినా స్వార్థం కోసమే ఆలోచన చేస్తున్న ఈ సమాజంలో భవితను మార్చే మంచి నాయకుడిని(Leader) ఎన్నుకోలేకపోతున్నాం.

ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం :ఎప్పుడూ నేను, నా భార్య, నా పిల్లలు బాగుండాలి అని ఆలోచన చేస్తూ... నా అనే పదం చుట్టూనే బతికేస్తున్నారు. రాష్ట్రం, దేశం బాగుపడాలని కోరుకోవడం లేదు. ఈ వలయం నుంచే బయటకొస్తేనే సమాజంలో మార్పు సాధ్యం అవుతుంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు.. అంగ, అర్థబలం ఉన్న నేతలను రంగంలోకి దించుతున్న ఈ రోజుల్లో.. ఓటరు తెలివిగా వ్యవహరించాల్సిన అవసరముంది.

ఓటు వేయకుంటే బతికి ఉన్నా లేనట్లే, వచ్చేస్తున్నాం, ఓటేస్తామంటున్న ప్రజానికం

కొన్ని నిమిషాలు వెచ్చించి పౌరులిచ్చే తీర్పు.. రాబోయే అయిదేళ్లపాటు వారి జీవన స్థితి గతుల్ని ప్రభావితం చేస్తుంది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు నిరుపయోగం కాకుండా అందరూ సద్వినియోగం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం(Democracy) ప్రకాశిస్తుంది. ఆ క్షణాలు కొన్ని గంటల్లో మనముందుకు రాబోతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తును మార్చే మీ ఓటు వేయడానికి అందరూ కదలి రండి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.

ఖాకీ నిఘాలో పోలింగ్ కేంద్రాలు- లక్షమందితో పటిష్ఠ బందోబస్తు

'నీ ఓటే రాజ్యమేలే సీటయిందిరా - దాన్ని అమ్ముకుంటే నీ బతుకు అగమవునురా'

ABOUT THE AUTHOR

...view details