Indian Army New Year Galwan: భారత సైన్యం తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకున్న ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. స్థావరంలోని సైనిక వర్గాలు వీటిని విడుదల చేశాయి. తుపాకులు చేతబట్టి, త్రివర్ణ పతాకం ఎగురవేస్తూ ఫొటోలు దిగారు సైనికులు.
సుమారు 30 మంది సైనికులు ఫొటోల్లో కనిపిస్తున్నారు. సైనికుల తాత్కాలిక అబ్జర్వేషన్ పోస్టు సైతం ఓ చిత్రంలో కనిపిస్తోంది. నలుగురు జవాన్లు త్రివర్ణ పతాకం పట్టుకోగా.. మిగిలిన వారు తుపాకులు ధరించి నిల్చున్నారు. ఈ ఫొటోలు జనవరి 1 నాటికి సంబంధించినవని సైనిక వర్గాలు తెలిపాయి.