తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటా: మోదీ - మోదీ

దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వారసత్వ రాజకీయాలపై మరోమారు విమర్శలు గుప్పించారు. ఉత్తర్​ప్రదేశ్​, కాన్పూర్​లోని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ పూర్వీకుల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు.

PM Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

By

Published : Jun 3, 2022, 5:11 PM IST

వారసత్వ రాజకీయాలపై మరోమారు విమర్శలు గుప్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటానన్నారు. ఉత్తర్​ప్రదేశ్​, కన్పూర్​లోని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ పూర్వీకుల గ్రామం పారౌంఖ్​ గ్రామంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. వారసత్వ రాజకీయాలు దేశంలో నైపుణ్యాన్ని అణచివేస్తున్నాయని ఆరోపించారు. వారసత్వ రాజకీయాల్లోని వారు తనకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నారని, వారి కుటిల నిర్ణయాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.

"దేశంలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలి. అప్పుడే మారుమూల గ్రామంలో జన్మించిన వ్యక్తి సైతం ప్రధానమంత్రి, రాష్ట్రపతి అయ్యేందుకు వీలుంటుంది. వారసత్వ పార్టీలు నాకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నాయి. ఎవరితో నాకు వ్యక్తిగతంగా విబేధాలు లేవు. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాను. బంధుప్రీతిలో చిక్కుకున్న ఈ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేసేందుకు ముందుకు రావాలి. ఈ రోజు రాష్ట్రపతి నన్ను రిసీవ్​ చేసుకునేందుకు వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డాను. మేము ఆయన కింద పని చేస్తున్నాము. ఆ పదవికి పవిత్రత ఉంది. కానీ, తాను రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, విలువలు ముఖ్యమని కోవింద్​ నాతో చెప్పారు. ఒక రాష్ట్రపతిగా కాకుండా గ్రామస్తుడిగా స్వాగతించేందుకు వచ్చినట్లు చెప్పారు. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు రాష్ట్రపతి కోవింద్​. జపాన్​ పర్యటన సందర్భంగా అక్కడి భారతీయులతో మోదీ మాట్లాడిన అంశాలను గుర్తు చేసుకున్నారు. ప్రపంచానికి భారత్​ శక్తిని కొత్త విధానంలో తెలియజేశారని పేర్కొన్నారు. మోదీ ఒక దృఢమైన నాయకుడని ప్రశంసించారు.

ఇదీ చూడండి:యూపీలో రూ.80వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం

ABOUT THE AUTHOR

...view details