Illicit Alcohol deaths: ఉత్తర్‌ప్రదేశ్ రాయ్‌బరేలీ జిల్లాలోని మహరాజ్‌గంజ్ కొత్వాలి పరిధిలో విషాదం ఘటన జరిగింది. కల్తీ మద్యం తాగి ఆరుగురు మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పహాడ్‌పుర్ గ్రామంలో జరిగింది.
ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్ వైభవ్ శ్రీవాస్తవ.. పోలీసులు, స్థానిక పాలనాయంత్రాంగంతో పాటు పహాడ్‌పుర్ గ్రామానికి చేరుకుని.. విచారణ చేపట్టారు.
"బాధితులందరూ పహాడ్‌పుర్ గ్రామానికి చెందినవారే. సమీపంలోని ఓ దుకాణంలో మద్యం సేవించి.. ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అర్థరాత్రి సమయంలో ఒకరి తర్వాత మరొకరు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆరుగురు మరణించారు. మిగిలినవారికి చికిత్స అందిస్తున్నారు. కల్తీ మద్యం తాగడం వల్లే వారు మరణించినట్లు తెలుస్తోంది" అని వైభవ్ శ్రీవాస్తవ తెలిపారు.