కొవిడ్ కాలంలో ఎందరో వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిస్వార్థంగా విధులు నిర్వహిస్తుంటే.. కొందరు మాత్రం ఆ వృత్తికే కళంకం తెచ్చే పనులు చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వైద్యుడు ఇటువంటి దారుణానికి పాల్పడి అధికారులకు చిక్కాడు. కల్తీ రక్తం సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైద్యుడు సహా మరో వ్యక్తిని రాష్ట్ర స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్) అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 100 యూనిట్ల రక్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల్లో ఒకరైన డాక్టర్ అభయ్ సింగ్ వద్ద 45 యూనిట్ల రక్తాన్ని అధికారులు గుర్తించారు. సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను సైఫాయి వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు ఎస్టీఎఫ్కు తెలిపాడు. వివిధ ప్రాంతాల నుంచి రక్తాన్ని సేకరించి.. సరఫరా చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఇంట్లో ఉన్నాయని తెలిపాడు. అయితే సింగ్ నివాసానికి వెళ్లిన అధికారులు.. ఆ పత్రాలను స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. అవి నకిలీవని తేలింది.