తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మైక్రోవేవ్ ఓవెన్​లోనూ మట్టి పాత్రలు- చేతివృత్తులకు ఐఐటీ చేయూత - సంప్రదాయ వృత్తులకు ఐఐటీ మద్రాస్​ చేయూత

సంప్రదాయ కుమ్మరులకు ఆర్థికంగా, సాంకేతికంగా చేయూత నిచ్చేందుకు ఐఐటీ మద్రాస్​ ముందుకు వచ్చింది. ఇందుకుగానూ కామన్​ ఫెసిలిటీ సెంటర్​ను ఏర్పాటు చేసింది. సీఎస్​ఆర్​ నిధులతో ఏర్పాటైన ఈ కేంద్రం ద్వారా బంక మట్టితోనే అధునాతన సాంకేతికతను ఉపయోగించి పాత్రలను తయారు చేస్తున్నారు.

IIT Madras helps TN Potters
కుమ్మరుల ఆర్థిక స్వావలంబనకు మద్రాస్​ ఐఐటీ చేయూత

By

Published : Aug 19, 2021, 8:52 PM IST

Updated : Aug 20, 2021, 12:49 PM IST

ఆధునిక కాలంలో మరుగున పడిపోతున్న చేతివృత్తుల్లో ఒకటైన కుమ్మరికి మద్రాస్ ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరిగి జవసత్వాలు అందిస్తోంది. వీరి ఆదాయాన్ని పెంచేందుకు సంస్థకు చెందిన రూరల్ టెక్నాలజీ యాక్షన్ గ్రూప్ సభ్యులు కామన్​ ఫెసిలిటీ సెంటర్​ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా కుమ్మరులు.. మైక్రోవేవ్​ ఓవెన్ల​లోనూ ఉపయోగించుకోగలిగే వంట పాత్రలను తయారు చేస్తున్నారు. సంప్రదాయ చేతి వృత్తులను కాపాడటం సహా వినియోగదారుల డిమాండ్లను కూడా తీర్చేలా వస్తువులు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ ఉత్పత్తులు మార్కెట్​లో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.

మట్టి పాత్రలను తయారు చేస్తున్న మహిళలు
అధునాతన సాంకేతికతో రూపుదిద్దుకున్న పాత్రలు

ఆర్థిక స్వావలంబన సాధించడానికి...

కుమ్మరుల్లో చాలా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మరికొంత మంది అయితే దారిద్ర్యరేఖకు దిగువన బతుకున్నారు. వీరికి సాయం చేసే దిశగా యంత్రాల సాయంతో మట్టి పాత్రలను తయారు చేసేలా ఐఐటీ సభ్యులు ప్రోత్సహిస్తున్నారు. సాంకేతికత ఉపయోగించడం వల్ల వస్తువుల ఉత్పత్తి గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉంటోంది. దానితోపాటు కార్మికులు ఆర్థికంగా కూడా ప్రయోజనం పొందుతున్నారు.

పాత్రల ప్రదర్శన
కామన్ ఫెసిలిటీ సెంటర్​లో తయారు చేసిన పాత్ర

సీఎస్​ఆర్​ నిధులతో..

కామన్ ఫెసిలిటీ సెంటర్​లో తయారు చేసిన పాత్ర

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్​కు సంబంధించిన దక్షిణ ప్రాంత పైప్‌లైన్స్ డివిజన్​ సీఎస్​ఆర్​ నిధులతో పాటు, నాగర్​కోయిల్​కు చెందిన సోషల్ ఫర్ డెవలప్‌మెంట్ అనే ఎన్​జీఓ నిధులతో ఈ కామన్​ ఫెసిలిటీ సెంటర్​ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్​కు సంబంధించి మద్రాస్ ఐఐటీ సెంట్రల్​ గ్లాస్​ అండ్​ సిరామిక్​ ఇన్​స్టిట్యూట్​తో కలిసి పని చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్​ ద్వారా కుమ్మరులకు అధునాతన సాంకేతికత అందించనున్నారు.

"చేతి వృత్తులను ప్రోత్సహించేలా, వారి అవసరాలను తీర్చేలా ఆర్​యూటీఏజీ ఆధ్వర్యంలోని కామన్​ ఫెసిలిటీ సెంటర్(సీఎఫ్​సీ)​ పని చేస్తుంది. పలు సంస్థల నిధులతో దీనిని నిర్మించాం. దీని ద్వారా వారికి ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడం సహా చేతివృత్తుల అవసరాలను గుర్తించడానికి ప్రయత్నిస్తాం. ఆ తర్వాత వాటిని ప్రామాణికంగా తీసుకుని అధ్యాపకులు, విద్యార్థులకు మరింత సాంకేతికతను వృద్ధి చేయడానికి ప్రయత్నిస్తారు. దీంతో ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా వస్తువుల ఉత్పత్తిలో నాణ్యత కూడా ఉంటుంది. "

-ప్రొఫెసర్ అభిజిత్ పి. దేశ్‌పాండే, ఐఐటీ మద్రాస్

సీఎఫ్​సీతో లాభాలెన్నో..

  • కుమ్మరుల ఆదాయం మూడు నుంచి నాలుగు రెట్లు అధికం అవుతుంది.
  • సంప్రదాయ వస్తు ఉత్పత్తుల కంటే సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన పాత్రల విలువ నాలుగు రెట్లు పెరుగుతుంది.
  • ఈ ఉత్పత్తులకు మార్కెట్​లో అధిక డిమాండ్​ ఏర్పడుతుంది.
  • కుమ్మరులకు శిక్షణ ఇచ్చి వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వృత్తిలో అవకాశాలు అందేలా చేస్తుంది.
  • శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్లను జారీ చేస్తుంది.

ఇదీ చూడండి:దివ్యాంగులకు కేంద్రం షాక్- ఉద్యోగ కోటాలో మినహాయింపులు!

Last Updated : Aug 20, 2021, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details