IIT JEE Advanced Result 2022: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఐఐటీల్లో ప్రవేశానికి ఆగస్టు 28న నిర్వహించిన పరీక్షా ఫలితాలను ఐఐటీ బాంబే ప్రకటించింది. ఈ ఫలితాల్లో బాంబే జోన్కు చెందిన ఆర్కే శిశిర్ టాపర్‌గా నిలిచాడు.
శిశిర్.. 360 మార్కులకు 314 మార్కులు సాధించి మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నాడు. దిల్లీ జోన్కు చెందిన తనిష్క కబ్రా 277 మార్కులతో బాలికల్లో టాపర్‌గా నిలిచింది. ఆమె ఆల్ ఇండియాలో 16వ ర్యాంక్ సాధించింది. ఆగస్టు 28న జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు 1.50 వేల మంది హాజరయ్యారు. వారిలో 40 వేల మంది అర్హత సాధించారు.
జేఈఈ ఫలితాలు విడుదల.. టాపర్‌గా శిశిర్
IIT JEE Advanced Result 2022: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో ప్రవేశానికి ఆగస్టు 28న నిర్వహించిన పరీక్షా ఫలితాలను ఐఐటీ బాంబే ప్రకటించింది. 314 మార్కులతో బాంబేకు చెందిన ఆర్కే శిశిర్ అనే విద్యార్థి ప్రథమ ర్యాంకు సాధించారు.
Etv Bharat
Last Updated : Sep 11, 2022, 12:12 PM IST