తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చౌకగా ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌.. ఐఐటీల కొత్త సాంకేతికత - ఐఐటీ చౌకగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్

IIT electric vehicle charging: ఎలక్ట్రిక్ వాహనా(ఈవీ)ల ఛార్జింగ్ కోసం దేశంలోని వివిధ ఐఐటీలకు చెందిన పరిశోధకులు కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఉన్న ఛార్జర్ వ్యయాన్ని ఇది సగానికి పైగా తగ్గించనుంది.

iit electric vehicle charging
iit electric vehicle charging

By

Published : Jan 24, 2022, 7:28 AM IST

IIT electric vehicle charging: దేశంలోని వివిధ ఐఐటీలకు చెందిన పరిశోధకులు ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ కోసం కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇది ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఆన్‌బోర్డ్‌ ఛార్జర్‌ సాంకేతికత వ్యయాన్ని సగానికి పైగా తగ్గించనుంది. దీంతో ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలకూ కళ్లెం పడే అవకాశం ఉంది!

IIT EV charging technology

ఈ సాంకేతికతను ఐఐటీ గువాహటి, ఐఐటీ భువనేశ్వర్‌లతో కలిసి వారణాసిలోని ఐఐటీ-బీహెచ్‌యూ పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. దేశంలోని ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఈ సాంకేతికతపై ఆసక్తి చూపిందని, వాణిజ్యపరమైన ఉత్పత్తికీ సుముఖత వ్యక్తం చేసిందని బృందం సభ్యులు తెలిపారు. అయితే సంస్థ పేరును వీరు వెల్లడించలేదు.

"దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంప్రదాయ ఐసీ ఇంజిన్లకు.. ఎలక్ట్రిక్‌ వాహనాలే సరైన ప్రత్యామ్నాయం. శక్తిమంతమైన ఆఫ్‌బోర్డ్‌ ఛార్జింగ్‌ సదుపాయాలు లేకపోవడంతో ఉత్పత్తిదారులు.. వాహనంలోనే ఆన్‌బోర్డ్‌ ఛార్జర్లు వాడుతున్నారు. దీనివల్ల తయారీ వ్యయం పెరుగుతోంది. మా ప్రతిపాదిత ఆన్‌బోర్డ్‌ ఛార్జర్‌ సాంకేతికతలో ప్రొపెల్షన్‌ మోడ్‌కు అవసరమైన అదనపు పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంటర్‌ఫేస్‌ను ఒక్క దాన్ని తగ్గిస్తున్నాం. దీంతో వాడాల్సిన పరికరాలు 50 శాతం తగ్గనున్నాయి. ప్రతిపాదిత సాంకేతికత.. ఛార్జింగ్‌ మోడ్‌లో ఛార్జర్‌గానూ. ప్రొపెల్షన్‌ మోడ్‌లో ఇన్వర్టర్‌గానూ పని చేస్తుంది" అని ఐఐటీ (బీహెచ్‌యూ) పరిశోధకుడు రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 9 శాతం!

ABOUT THE AUTHOR

...view details