తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2021, 5:57 PM IST

ETV Bharat / bharat

ఆయన ఇల్లే ఓ వింటేజ్​ బైక్​ మ్యూజియం!

ఒకప్పుడు రోడ్లపై రయ్​మంటూ దూసుకెళ్లిన.. యమహా రాజ్​దూత్​, వెస్పా, చేతక్​ వంటి బైకులు, స్కూటర్లు ఇప్పుడు మనకు కనిపించడం చాలా అరుదు. కానీ, ఇలాంటి పాత బైకులను సేకరించారు కేరళకు చెందిన ఓ వ్యక్తి. ఆయన దగ్గర 65కుపైగా పాత మోడల్​ ద్విచక్రవాహనాలు ఉన్నాయి.

bike collector
అనాజ్​ కూనారి వద్ద ఉన్న బైకులు, స్కూటర్లు

అనాజ్​ కూనారి వద్ద ఉన్న అరుదైన పాత బైకులు, స్కూటర్లు

కేరళ ఇడుక్కి జిల్లా అడిమాలీకి చెందిన అనాజ్​ కూనారి ఇంటికి వెళ్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అడిమాలీ పట్టణంలో పక్షులు, పెంపుడు జంతువుల దుకాణం నడిపే అనాజ్​ వద్ద 65కుపైగా అరుదైన వింటేజ్​ స్కూటర్లు, బైకులు ఉన్నాయి. ఆ వాహనాలన్నీ ఒకప్పుడు రోడ్ల మీద రయ్​మంటూ దూసుకెళ్తూ అందరి దృష్టిని ఆకర్షించినవే.

అత్యంత భద్రంగా..

ఈ బైకుల పాత లుక్​ను, డిజైన్​ను ఏ మాత్రం పోనీయకుండా అనాజ్​ వాటిని కాపాడుతున్నారు. 1959 మోడల్​ ఇటాలియన్​ లాంబ్రెట్టాకు కొత్తగా పెయింట్​ వేసి, మెరిసిపోయేలా చేశారు. విజయ్​ సూపర్​, బజాజ్​, లక్ష్మీ, టీవీఎస్​ ఎక్స్​ప్రెస్​, బాబీరాజ్​దూత్​ వంటి అరుదైన పాత బైకులను అనాజ్​ అత్యంత భద్రంగా కాపాడుతున్నారు.

బైకులను శుభ్రం చేస్తున్న అనాజ్​ కూనారి

ద్విచక్ర వాహనాల్లో ఒకప్పుడు వెలుగు వెలిగిన లాంబీ, వెస్పా, చేతక్​, యేజ్దీ, రాజ్​దూత్​ వంటి ద్విచక్రవాహనాలు.. అనాజ్​ ఇంటికి వెళ్తే మనకు దర్శనమిస్తాయి. మున్నార్​లో ఎప్పటికైనా.. ద్విచక్రవాహనాలతో ఓ మ్యూజియంను ఏర్పాటు చేయాలనేదే తన​ కల అని చెబుతున్నారు అనాజ్​.

చిన్నప్పటి నుంచే..

అనాజ్​కు ఇలా వస్తువులను సేకరించే అలవాటు తన చిన్నప్పటి నుంచే ఉంది. ఆయన దగ్గర బైకులు, స్కూటర్లే కాకుండా.. పాత కాలం నాటి రేడియో, టీవీ వంటివి కూడా ఉన్నాయి. పలు సినిమాలు, సీరియళ్లలోనూ అనాజ్​ నటించారు. 1993 నుంచి 2000 సంవత్సరాల మధ్య మడ్​ట్రక్​ రేసుల్లోనూ ఆయన పాల్గొన్నారు. అనాజ్​ తన వద్ద ఉన్న బైకులను సినిమా షూటింగ్​లకు అద్దెకు ఇస్తూ ఉంటారు. యమహా ఆర్ఎక్స్​-100 బైక్​తో మొదలైన ఈ పాత బైకులను సేకరించే అలవాటుకు తన కుటుంబ సభ్యులు పూర్తి మద్దతునందిస్తున్నారని చెబుతున్నారు.

ఇదీ చూడండి:కొవిడ్​ వేళ గుర్రపు పందెం- భారీగా జనం!

ఇదీ చూడండి:భారత్‌కు ప్రపంచ దేశాల ఆపన్నహస్తం!

ABOUT THE AUTHOR

...view details