ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) అసిస్టెంట్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా.. 1044 ఎగ్జిక్యూటివ్, 500 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
గుర్తుంచుకోవాల్సిన తేదీలు:
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్ 03, 2022
- దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 17, 2022
- ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రాత పరీక్ష తేదీ: జులై 9, 2022
- అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రాత పరీక్ష తేదీ: జులై 23, 2022
అర్హతలు:
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేయాలి
- డిగ్రీలో కనీసం 55శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కోటా వారికి 50శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయస్సు:
- ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 1-04-2022 నాటికి 20 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయో పరిమితి 25 ఏళ్లు.
- అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 28 ఏళ్ల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.