తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవం రోజు తిరంగా యాత్రలు

ప్రజాస్వామ్య, లౌకికవిలువలను కాపాడటమే తమ లక్ష్యమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున తిరంగా యాత్ర చేపట్టాలని అన్ని రాష్ట్రాల పీసీసీలను ఏఐసీసీ ఆదేశించింది. అంతే కాకుండా సామాజిక మాధ్యమాలలో తిరంగాతో సెల్ఫీ కార్యక్రమాల్ని నిర్వహించాలని తెలిపింది. దిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించాలని పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను కోరింది.

AICC directs PCCs to organise 'Tiranga Yatras' on party's foundation day
పార్టీ ఆవిర్భావదినోత్సవం రోజున 'తిరంగా యాత్ర' చేయండి

By

Published : Dec 24, 2020, 5:45 PM IST

కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవం(డిసెంబర్​28)న తిరంగా యాత్ర జరపాల్సిందిగా అన్ని రాష్ట్రాల పీసీసీ లను ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ర్యాలీల సమయంలో కొవిడ్​ నిబంధనలు పాటించాలని సూచించింది. సామాజిక మాధ్యమాలలో తిరంగాతో సెల్ఫీ కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపింది.

పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లో జరిగే ఆవిర్భావ దినోత్సవాన్ని పరిశీలించాలని పీసీసీలకు సూచించింది. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని కోరింది. అంతేకాకుండా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులకు పీసీసీలు సంఘీభావం తెలపాలని పేర్కొంది.

ప్రజాస్వామ్య , లౌకిక భావాలను కాపాడటంలో కాంగ్రెస్​ ముందుంటుందని అధిష్ఠానం స్పష్టం చేసింది. పేద దేశం నుంచి ప్రపంచాన్ని శాసించే దేశంగా భారత్ ఎదగడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని తెలిపింది.

2020 డిసెంబర్​ 28కి కాంగ్రెస్​ పార్టీ ఏర్పడి 136 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్​ నిర్వహించనుంది. 1885 డిసెంబర్​ 28న కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పార్టీ మొట్టమొదటి సమావేశం ముంబయిలో జరిగింది.

ఇదీ చూడండి:మారని హస్తరేఖలు.. కుటుంబ పరిధి దాటని కాంగ్రెస్​!

ABOUT THE AUTHOR

...view details