తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐబీపీఎస్​ క్లర్క్​ పోస్టుల భర్తీకి బ్రేక్​! - ఐబీపీఎస్​ ఉద్యోగాలు

వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,800కుపైగా క్లర్క్​ పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్​(IBPS Clerk Recruitment 2021) జారీచేసింది ఐబీపీఎస్​. తాజాగా పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది.

ibps
ibps

By

Published : Jul 15, 2021, 3:08 PM IST

నిరుద్యోగులకు నిరాశ. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్​ పోస్టుల భర్తీ(IBPS Clerk Recruitment 2021) ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది ఐబీపీఎస్(​ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బ్యాంకింగ్​ పర్సెనల్​ సెలక్షన్​). అనివార్య కారణాల వల్ల ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది.

తదుపరి వివరాల కోసం తమ వెబ్​సైట్​(ibps.in)ను పరిశీలించాలని ఐబీపీఎస్​ స్పష్టం చేసింది.

"క్లర్క్​ పోస్టుల భర్తీ కోసం నిర్వహించాల్సిన ప్రాథమిక, మెయిన్స్​ పరీక్షల ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాము."

- ఐబీపీఎస్​.

మొత్తం 5,830 క్లర్క్​ పోస్టులకు ఆగస్టు చివర్లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఇటీవలే నోటిఫికేషన్​ను జారీ చేసింది ఐబీపీఎస్​. ఇంతలోనే రిజిస్ట్రేషన్​ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది.

ఇదీ చూడండి:-ఐఓసీఎల్​లో ఉద్యోగ అవకాశాలు- వీరే అర్హులు!

ABOUT THE AUTHOR

...view details