అఫ్గానిస్థాన్లో అమెరికా విడిచిపెట్టి వెళ్లిన ఆయుధ సామగ్రి తాలిబన్ల చేతికి చిక్కింది. అత్యాధునిక ఆయుధాలతో తాలిబన్లు ఏం చేస్తారోనని ఆందోళన నెలకొంది. అదే సమయంలో తాలిబన్ల నుంచి ఇతర ఉగ్రసంస్థలకు ఆ ఆయుధాలు చేతులు మారే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత వాయుసేన(ఐఏఎఫ్).. దేశ ఆయుధ సంపత్తిని పెంపొందించుకునే చర్యలను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా.. రష్యా నుంచి 70వేల ఏకే-103(ak-103 india) రైఫిళ్లను అత్యవసరంగా కొనుగోలు చేసింది(iaf news).
కొత్తగా కొనుగోలు చేసిన రైఫిళ్లు కొన్ని నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా ఉగ్రదాడులను నియంత్రించేందుకు భద్రతా బలగాలు మరింత శక్తిమంతమవుతాయి.
"70వేల ఏకే-102 రైఫిళ్లను రష్యా నుంచి గత వారం అత్యవసరంగా కొనుగోలు చేశాము. ఈ కాంట్రాక్టు విలువ రూ. 300కోట్లు. జమ్ముకశ్మీర్, శ్రీనగర్ వంటి సున్నిత ప్రాంతాల్లో, వాయుసేన స్థావరాల వద్ద ఉన్న భద్రతా సిబ్బందికి తొలుత అందిస్తాము."
-- ప్రభుత్వ వర్గాలు.