తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అగ్నిపథ్​ నిరసనలు.. మరోవైపు దరఖాస్తుల వెల్లువ.. వాయుసేనకు 3 రోజుల్లోనే! - iaf agnipath scheme

IAF Agnipath scheme: దేశవ్యాప్తంగా అగ్నిపథ్​కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో వాయుసేనకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. కేవలం నియామక ప్రక్రియ ప్రారంభమైన మూడు రోజుల్లోనే 59,960 దరఖాస్తులు వచ్చాయని వాయుసేన అధికారులు తెలిపారు.

agnipath scheme
అగ్నిపథ్ పథకం

By

Published : Jun 26, 2022, 9:20 PM IST

IAF Agnipath scheme: వాయుసేనలో(ఐఏఎఫ్​) అగ్నిపథ్‌ కింద నియామకాల ప్రక్రియ ప్రారంభమైన మూడు రోజుల్లోనే 59,960 దరఖాస్తులు వచ్చాయి. అగ్నిపథ్ కింద వాయుసేన దరఖాస్తు ప్రక్రియను శుక్రవారం ప్రారంభించింది ఐఏఎఫ్​. ఓ వైపు అగ్నిపథ్​కు వ్యతిరేకంగా దేశంలో పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న సమయంలో మూడు రోజుల్లోనే ఇన్ని దరఖాస్తులు రావడం చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 5వ తేదీన ముగుస్తుందని వాయుసేన అధికారులు వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు athvayu.cdac.in వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తు, జత చేసిన స్కాన్‌ కాపీలను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. అగ్నివీర్‌ తొలి బ్యాచ్​ను 2022 డిసెంబర్‌ 11 నాటికి ప్రకటించనున్నారు. ఆందోళనలు కొనసాగుతున్నా.. ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని త్రివిద దళాలు తేల్చి చెబుతున్నాయి.

సాయుధ బలగాల నియామక ప్రక్రియ అగ్నిపథ్​ పథకంలో ఎన్​సీసీ క్యాడెట్​లకు బోనస్ పాయింట్లు లభిస్తాయని ఆ సంస్థ డైరెక్టర్​ లెఫ్టెనెంట్ జనరల్ గుర్బీర్​పాల్ సింగ్ అన్నారు. ఎన్​సీసీలో ఏ,బీ,సీ సర్టిఫికేట్​ ఉన్నవారందరికి బోనస్​ పాయింట్లు లభిస్తాయని వెల్లడించారు. 'అగ్నిపథ్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్​ 14న ప్రకటించింది. 17న్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగేళ్ల పూర్తయ్యాక వారి 25 శాతం మందిని మరో 15 ఏళ్లపాటు కొనసాగిస్తారని పేర్కొంది. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా యువత.. నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో 2022 రిక్రూట్​మెంట్​లో గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం 23 ఏళ్లకు పెంచింది. తక్కువ కాలపరిమితి(షార్ట్‌) సర్వీసు కమిషన్‌ కింద యువతకు అవకాశం ఇవ్వడం ద్వారా ప్రస్తుతం ఆర్మీ బెటాలియన్లలో సగటు వయసు 35-36 ఏళ్ల నుంచి 25-26 ఏళ్లకు తగ్గనుంది.

నాలుగేళ్ల కాలపరిమితితో తొలిసారిగా కేంద్రం తీసుకొచ్చిన 'అగ్నిపథ్‌' సర్వీస్‌ పథకం కింద తొలిబ్యాచ్‌లో 45 వేల మందిని నియమించనున్నారు. టూర్‌ ఆఫ్‌ డ్యూటీ పేరిట ప్రత్యేక ర్యాలీలు నిర్వహించి ఈ నియామకాలు చేపట్టనున్నారు. నాలుగేళ్ల పరిమితితో కూడిన ఈ సర్వీస్‌లో ఎంపికైన వారికి సాంకేతిక నైపుణ్యంతో పాటు క్రమశిక్షణ కలిగినవారిగా తీర్చిదిద్దనున్నారు.

ఇవీ చదవండి:యూపీలో యోగి మేజిక్.. ఎస్పీ కోటలు బద్దలు.. పంజాబ్​లో ఆప్​కు షాక్

'ఆ 40 మంది బతికి ఉన్న శవాలు.. వచ్చాక అక్కడికే పంపిస్తాం'

ABOUT THE AUTHOR

...view details