భారత్ ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలపై వాయుసేన కమాండర్లు నిర్వహించే సమీక్షా సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ద్వైవార్షిక కమాండర్ల సమావేశాలను.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. దిల్లీలోని వాయుసేన హెడ్‌క్వార్టర్స్(వాయు భవన్)లో ప్రారంభించారు.
భారత వాయుసేనకు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు ఈ సమావేశాల్లో పాల్గొని వివిధ అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇందులో భాగంగా గురువారం.. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌కు ఉన్న సమస్యల గురించి చర్చించారు. తూర్పు లద్దాఖ్‌లోని పరిస్థితులు, చైనా ఆర్మీతో ఉన్న సమస్యలపై సమాలోచనలు జరిపారు.