తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో డీఎంకే అభ్యర్థి ఇళ్లపై ఐటీ సోదాలు! - స్టాలిన్ కారుర్​ పర్యటన

డీఎంకే నేత సెంథిల్ బాలాజీ అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. అరవకురుచ్చి​ నియోజకవర్గంలో సెంథిల్​కు మద్దతుగా డీఎంకే అధినేత స్టాలిన్ ప్రచార సభలో పాల్గొననున్న నేపథ్యంలో ఈ సోదాలు జరగడం గమనార్హం.

IT raids on DMK candidate supporter
డీఎంకే నేత ఆస్తులపై ఐటీ సోదాలు-రూ. 7 కోట్లు స్వాధీనం!

By

Published : Mar 26, 2021, 12:38 PM IST

తమిళనాట ఎన్నికల వేళ నాయకుల ఇళ్లపై వరుస ఐటీ దాడులు రాజకీయ వేడిని రగుల్చుతున్నాయి. డీఎంకే నేత సెంథిల్ బాలాజీ అనుచరుల ఇళ్లు, కార్యాలయాల్లో గురువారం రాత్రి ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. మొత్తం 50 మంది ఐటీ అధికారులు 6 బృందాలుగా విడిపోయి ఈ సోదాలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో రూ. 7 కోట్ల మేర నల్లధనం పట్టుబడినట్లు సమాచారం. అయితే.. ఈ విషయంపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

డీఎంకే నేత అనుచరుడి ఇంట్లో ఐటీ సోదాలు

శుక్రవార సాయంత్రం 5 గంటలకు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కారుర్​ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్న నేపథ్యంలో ఈ ఐటీ దాడి జరగడం గమనార్హం.

ఇటీవలే.. డీఎంకే నేత ఈవీ వేలుకు మద్దతిస్తూ స్టాలిన్​ తిరువణ్నామలై పర్యటించారు. ఆ సమయంలో వేలుకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది.

ఇదీ చదవండి:తమిళనాట మరోసారి సంస్కృత పేర్లపై వివాదం!

ABOUT THE AUTHOR

...view details