అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేరళలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత పీసీ చాకో.. కాంగ్రెస్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు.
ఈ మేరకు తన రాజీనామాను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించనున్నట్లు కొచిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు చాకో.
" ఏప్రిల్ 6న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక రెండు గ్రూపుల ద్వారా అప్రజాస్వామికంగా జరుగుతోంది. గ్రూప్-ఏకు ఊమన్ ఛాందీ నాయకత్వం వహిస్తుండగా.. గ్రూప్-ఐ.. రమేశ్ చెన్నితల నేతృత్వంలో నడుస్తోంది. "
- పీసీ చాకో
పార్టీ సీనియర్ నేత, దివంగత కరుణాకరన్, సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ కాలం నుంచే ఈ గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు చాకో. అందులో ఏ గ్రూప్‌నకు ఆంటోని, ఐ గ్రూప్‌నకు కరుణాకరన్ నేతృత్వం వహించారని తెలిపారు.
ఇదీ చూడండి:కేరళ ఫలితాలను శాసించే 'సామాజిక లెక్క'లు