తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హైదరాబాద్​ మెట్రోలో ఉద్యోగాలు.. వారికే ఛాన్స్.. ఎలా అప్లై చేయాలో తెలుసా?

Hyderabad Metro Rail Recruitment 2023 : హైదరాబాద్​ మెట్రోలో ఖాళీల భర్తీకి సంస్థ సిద్ధమైంది. ఈ మేరకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఏఎమ్​ఎస్​ ఆఫీసర్, సిగ్నలింగ్ టీమ్, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, ట్రాక్స్ టీమ్ లీడర్, ఐటీ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

By

Published : Apr 17, 2023, 12:20 PM IST

Hyderabad Metro Rail Recruitment 2023
హైదరాబాద్ మెట్రో రైల్ రిక్రూట్‌మెంట్ 2023

Hyderabad Metro Rail Recruitment 2023 : హైదరాబాద్​ మెట్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడులైంది. సంస్థలోని పలు ఖాళీలను భర్తీ చేసేందుకు ఎచ్​ఎమ్​ఆర్​ఎల్​ దరఖాస్తులను ఆహానిస్తోంది. ఏఎమ్​ఎస్​ ఆఫీసర్, సిగ్నలింగ్ టీమ్, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, ట్రాక్స్ టీమ్ లీడర్, ఐటీ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఈ సంస్థలో ఉద్యోగాలు పొందాలంటే అవసరమైన అర్హతలు, ఖాళీల వివరాల గురించి తెలుసుకుందాం.

హైదరాబాద్​ మెట్రోలో ఉద్యోగాలు పొందాలంటే కావలసిన అర్హతలు..

1. ఏఎమ్​ఎస్​ ఆఫీసర్​..

  • వ్యాపార విశ్లేషకుడిగా, సొల్యూషన్ ఆర్కిటెక్ట్‌గా మంచి అనుభవం కలిగి ఉండాలి. IBM మ్యాక్సిమో సాఫ్ట్​వేర్​లో నైపుణ్యం ఉండాలి.
  • అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ​

2. సిగ్నలింగ్ టీమ్​..

  • SIG/COM/AFC నిర్వహణలో డిప్లొమా ఇంజనీర్‌గా కనీసం 4 నుంచి 8 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కమ్యూనికేషన్​లో డిప్లొమా/ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అయిండాలి.

3. రోలింగ్​ స్టాక్ టీం లీడర్​..

  • ఇంజనీర్​- మెకానికల్​/​ ఎలక్ట్రికల్​/ ఎలక్ట్రానిక్స్​లలో డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
  • ఎలక్ట్రికల్​ లేదా మెకానికల్​ మెయింటనెన్స్​లో 4 నుంచి 8 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • సాంకేతికత ఆధారిత రైలు/మెట్రో, పారిశ్రామిక వాతావరణంలో పని చేసే పరిజ్ఞానం ఉండాలి.

4. ట్రాక్స్ టీం లీడర్​..

  • బీఈ/బీటెక్​ పూర్తి చేసి నాలుగు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. లేదంటే ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వారికి ట్రాక్​ నిర్వహణలో.. 4 నుంచి 7 సంవత్సరాల అనుభవం ఉండాల్సి ఉంటుంది.
  • సివిల్​ లేదా మెకానికల్​లో డిప్లొమా/గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలి.

5. ఐటీ ఆఫీసర్​..

  • బీటెక్​, ఐటీ/ఎమ్​సీఏ/ఐటీ/ ఎమ్​సీఏ-ఐటీ పూర్తి చేసి ఉండాలి.
  • బహుళజాతి, సర్వీసెస్​ కన్సల్టింగ్ పరిశ్రమలలో 1-2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
  • ఖాళీల వివరాలు..
    • మొత్తం ఖాళీలు-12
    • ఏఎమ్​ఎస్​ ఆఫీసర్​ - 1
    • సిగ్నలింగ్ టీమ్​ - 2
    • రోలింగ్​ స్టాక్ టీం లీడర్​ - 6
    • ట్రాక్స్ టీం లీడర్​ - 2
    • ఐటీ ఆఫీసర్​ - 1

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
నోటిఫికేషన్​లో పేర్కొన్న అర్హతలు కలిగిన వారు KeolisHyd.Jobs@keolishuderabad.com మెయిల్​కు తమ సీవీని పంపించాలి.

1.3లక్షల కానిస్టేబుల్ ఉద్యోగాలు..
ఇటీవల సీఆర్​పీఎఫ్ నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. 1.3 లక్షల సీఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయనున్నారు. హోం మంత్రిత్వ శాఖ పేరిట.. మొత్తం జనరల్​ డ్యూటీ(జీడీ) ఉద్యోగాలకు ప్రకటన​ విడుదలైంది. పురుషులతో పాటు మహిళలు కూడా ఇందులో అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఉద్యోగాల భర్తీలో మాజీ అగ్నివీరులకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details