తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Husband Suicide Selfi Video Viral : భార్య విడిచి వెళ్లిపోయిందని.. భర్త ఆత్మహత్య.. వీడియో వైరల్​ - సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య

Husband Committed Suicide Video : భార్య తనను విడిచి వెళ్లిపోయిందని.. నువ్వు లేక నేను లేనంటూ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్య మొత్తాన్ని సెల్ఫీ వీడియో చిత్రీకరించి.. తాను చనిపోయిన తర్వాత తన భార్యపై కేసు పెట్టవద్దని ఆమెపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశాడు. తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి.. లోకం విడిచి పెట్టి వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా షాద్​ నగర్​లో జరిగింది.

Husband Suicide
Husband Suicide

By

Published : Jul 1, 2023, 7:31 PM IST

Husband Committed Suicide His Wife Had Left Him : భార్య ఎటువెళ్లిందో తెలియదు.. తను వస్తుందో రాదో తెలియదు.. ఆమె ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. భార్య మీద ఉన్న అపారమైన ప్రేమ.. నువ్వు లేక నేను లేను అంటూ ఓ భర్త వీడియో చిత్రీకరించి అన్నంలో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్యచేసుకున్నాడు. ఈ హృదయ విదారకమైన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్​ నగర్​లో జరిగింది. పోలీసులు విషయం తెలుసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరూక్​ నగర్​ మండలం కొండన్న గూడ గ్రామానికి చెందిన రాజు గౌడ్​ గతంలో గూడ్స్​ వెహికల్​ డ్రైవర్​గా ఉంటూ.. జీవనోపాధి పొందేవాడు. చాలా కాలం క్రితమే తన తల్లితో కలసి.. షాద్​నగర్​కు వచ్చి నివాసం ఉండేవారు. రాజు, శ్వేతకు 10 ఏళ్ల క్రితమే వివాహమై.. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం నందిగామ మండల పరిధిలోని ఓ పరిశ్రమలో డ్రైవర్​గా పని చేస్తూ.. కుటుంబ పోషణ చేస్తున్నాడు.

Husband Committed Suicide At Shadnagar : ఇప్పటి వరకు సాఫీగానే సాగిపోతున్న వీరి జీవితంగా ఒక్కసారిగా పెద్ద కుదుపు వచ్చింది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో.. శ్వేత మూడు రోజుల క్రితం భర్తకు చెప్పకుండా ఏటో వెళ్లిపోయింది. తన ఆచూకీ కోసం షాద్​ నగర్​ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు రోజులుగా ఒంటరిగా ఉన్న తాను.. మానసిక ప్రశాంత కోల్పోయామని ఆమె ఉంటే బాగుండు నువ్వు లేక నేను లేనని.. రాజు తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి అన్నంలో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతనిని.. స్థానిక ఆసుపత్రికి తరలించినా లాభం లేదు. అప్పటికే మరణించాడని డాక్టర్లు చెప్పారు.

Husband Committed Suicide News : తన మరణానికి గల కారణాలను రాజు వీడియోలో చిత్రీకరించి.. ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఆమె తనను విడిచి వెళ్లిన బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. తన భార్య శ్వేత అంటే చాలా ఇష్టమని.. తన తల్లి కన్నా ఎక్కువే అంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. తాను చనిపోయిన తర్వాత.. ఆమెపై కేసు పెట్టవద్దంటూ షాద్​ నగర్​ సీఐను వీడియోలో కోరాడు. తన ఇద్దరి ఆడపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. తన చావుకు తానే కారణమని పేర్కొని.. ప్రాణాలను విడిచాడు. రాజు ఆత్మహత్య వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో చూసినవారు కన్నీటి పర్యంతమయ్యారు. భార్యపై ఉన్న ప్రేమను చూసి.. ఇది కదా అసలైన ప్రేమ అని బాధపడుతున్నారు.

భార్య విడిచి వెళ్లిపోయిందని.. భర్త ఆత్మహత్య..

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details