జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి భద్రతా బలగాలు. అవంతిపొరా జిల్లా త్రాల్ ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.
విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు అవంతిపొరా పోలీసులు, ఆర్మీ 42ఆర్ఆర్, సీఆర్పీఎఫ్ 180 బెటాలియన్ బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. త్రాల్‌లోని సిమోహ్ నల్లా ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా.. 50-60 లీటర్ల సామర్థ్యం ఉన్న ఓ ప్లాస్టిక్ కంటెయినర్ నిండా ఐఈడీ సామగ్రిని గుర్తించాయి.
- గన్ పౌడర్(అమోనియా).. సుమారు 40-50 కిలోలు
- ఎలక్ట్రిక్ డిటొనేటర్స్... 2
- కార్డెక్స్ వైర్... 4 మీటర్లు
- ఎలక్ట్రిక్ కమాడ్ వైర్.. 100 మీటర్లు