తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం! - longest railway platform in world

కర్ణాటక హుబ్బళ్లిలో ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం 550 మీటర్ల పొడవున్న ఈ ప్లాట్​ఫాంను 1,505 మీటర్లకు పెంచుతున్నారు. ఈ ప్లాట్‌ఫాం నిర్మాణ, అభివృద్ధి పనులు 2021 జనవరినాటికి పూర్తవుతాయని అంచనా.

Hubli has the longest railway platform in the world
ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం!

By

Published : Nov 20, 2020, 7:26 AM IST

నైరుతి రైల్వే ప్రధాన కేంద్రం హుబ్బళ్లిలో ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం 550 మీటర్ల పొడవున్న ఈ ప్లాట్‌ఫాంను తొలుత 1,400 మీటర్లకు పెంచాలని భావించారు. ఇప్పుడు దాన్ని 1,505 మీటర్లకు పెంచుతున్నారు.

రూ.90 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్లాట్‌ఫాం నిర్మాణ, అభివృద్ధి పనులు 2021 జనవరినాటికి పూర్తవుతాయని అంచనా. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈశాన్య రైల్వేజోన్‌ ప్రధాన కేంద్రమైన గోరఖ్‌పూర్‌లో ప్రపంచంలో అతి పొడవైన 1,366 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫాం ఉంది. హుబ్బళ్లి ప్లాట్‌ఫాం అందుబాటులోకి వస్తే సరికొత్త రికార్డు నమోదవుతుంది.

ఇదీ చూడండి:భారత్‌లో 'ముడుపుల' ముప్పు ఎక్కువే

ABOUT THE AUTHOR

...view details