How To Improve Childrens English Language Skills : పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడాలని భావించే తల్లిదండ్రులు.. వారికి చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్‌ను నేర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం స్వయంగా పేరెంట్స్ కొంత "హోం వర్క్" చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అప్పుడే.. పిల్లలు ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలను సరిగ్గా నేర్చుకోగలరని అంటున్నారు. మరి.. పేరెంట్స్ ఏం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చిన్నవయసు నుంచే :
చిన్నపిల్లలకు ఇంగ్లీష్ భాషలో నైపుణ్యాలను నేర్పించడానికి.. పిల్లల వయస్సు రెండు మూడేళ్లు ఉన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వయస్సులో పిల్లలు చిన్నచిన్న పదాలను మాట్లాడటం, తల్లిదండ్రుల మాటలను అర్థం చేసుకోవటం ప్రారంభిస్తారని అంటున్నారు. వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం ద్వారా పిల్లలు త్వరగా భాష నైపుణ్యాలను నేర్చుకుంటారని తెలియజేస్తున్నారు.
రెగ్యూలర్‌గా చదవడం, రాయడం:
పిల్లలు ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం సాధించడానికి తల్లిదండ్రులు వారితో తరచూ చిన్నచిన్న రైమ్స్, స్టోరీస్, వర్డ్స్ రాయించాలి. చదివించాలి. ఇలా చేయడం వల్ల వారిలో ఇంగ్లీష్ పట్ల ఉన్న భయం తొలగిపోయి ఈజీగా నేర్చుకుంటారు.
ఇంట్లో మాట్లాడండి :
మీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారితో ఇంగ్లీష్‌లోనే మాట్లాడండి. వీలైతే కుటుంబ సభ్యులందరూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి. ఇలా చేయడం వల్ల వారు తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
మీ పిల్లలు నిత్యం నవ్వుతూ ఉండాలా? - అయితే ఈ 5 విషయాలు చెప్పండి!
రోజుకో కొత్త ఇంగ్లీష్ పదం నేర్పించండి :
పిల్లలు ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం సంపాదించడానికి తల్లిదండ్రులు వారికి రోజుకు ఒక కొత్త పదాన్ని నేర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ కొత్త పదాలు ఏ విధంగా ఉపయోగించవచ్చో వాక్యాల రూపంలో తెలియజేయాలని చెబుతున్నారు. దీనివల్ల వారిలో భాష స్థాయి పెరుగుతుందని అంటున్నారు.