How To Get Our Lost ThingsIn Train :రైల్లో మనం ప్రయాణం చేసేటప్పుడు మనం పోగొట్టుకున్న సామగ్రి, వస్తువులను తిరిగి పొందవచ్చనే విషయం చాలా మందికి తెలియదు. చాలా సులభమైన పద్ధతిలో మన వస్తువులను తిరిగి పొందవచ్చు. అయితే ట్రైన్లో మరిచిపోయిన వస్తువులను రైల్వే అధికారులు చాలా సందర్భాల్లో తిరిగి ప్రయాణీకుల చెంతకు చేర్చారంటే మీకు ఆశ్చర్యం కలుగవచ్చు. మీరు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందేందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
రైల్వే పోలీసులుకు సమాచారం..
రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు సమయంలో మరిచిపోవడం కానీ పోగొట్టుకున్నట్లయితే ఆందోళన చెందవద్దు. ముందుగా ఈ విషయాన్ని రైల్వే అధికారులను సంప్రదించి వారికి తగు వివరాలను సమర్పించండి. ముఖ్యంగారైల్వే పోలీసులకు(ఆర్పీఎఫ్) ఈ సమాచారాన్ని వీలైనంత త్వరగా తెలియజేయండి. వారు ఒక వేళ మీకు సంబంధించిన లగేజీ ఆచూకీ కనిపెట్టలేకపోతే మీకు ఇంకో మార్గం కూడా ఉంది. అప్పుడు మీరు ఆర్ఫీఎఫ్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి.
మీ వస్తువులను ఎవరైనా దొంగిలిస్తే..ఇలా చేయండి
మీరు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మీ వస్తువులను ఎవరైనా దొంగిలించినట్లయితే చింతించవద్దు. వెంటనే మీరు ఆ కోచ్‌లో ఉన్న టికెట్ కలెక్టర్‌కు మీ సమస్యను వివరించవచ్చు. కోచ్ అటెండెంట్, గార్డ్లకు తెలియజేయడం ద్వారా మీ సమస్యకు పరిష్కారం లభించవచ్చు. వారు మీకు ఒక ఎఫ్ఐఆర్(ప్రాథమిక సమాచార నివేదిక) ఫామ్ ఇస్తారు. మీరు వాస్తవాలతో కూడిన వివరాలను వారికి అందించాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన ఫిర్యాదును తదుపరి చర్యల కోసం వారు స్థానిక పోలీస్ స్టేషన్‌కు పంపిస్తారు. దీంతో సులభంగా మీ ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగించకుండానే సమస్యకు పరిష్కారం పొందవచ్చు.