Simple Tips for Check Gas Cylinder Level : ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఎల్పీజీ వంటగ్యాస్(LPG Gas) సిలిండర్స్ ఉన్నాయి. ఇక కొందరైతే రెండు, మూడు చొప్పున గ్యాస్ బండలు కలిగి ఉన్నారు. అయితే ఒక్కోసారి రెండో బండ త్వరగా బుక్ చేయరు. ఉన్న సిలిండర్ హఠాత్తుగా ఖాళీ అవుతుంది. దీంతో.. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు కలిగే ఇరిటేషన్ మామూలుగా ఉండదు. ఈ పరిస్థితి రాత్రిపూట వస్తే.. ఇక అంతేసంగతులు. పస్తులతో కూడా పడుకోవాల్సి వస్తుంది.
Best Tricks for Gas Cylinder Level Check :అయితే.. చాలా మంది సిలిండర్లో గ్యాస్ అయిపోయిందా? లేదా? అనేది తెలుసుకోవడానికి కొన్ని రోజుల తర్వాత దాన్ని చేతితో కాస్త పైకి ఎత్తి అంచనా వేస్తుంటారు. మరికొందరైతే మంట నీలం రంగు నుంచి ఎరుపు రంగులోకి మారిన తర్వాత గ్యాస్ కొన్ని రోజులలో అయిపోతుందని భావిస్తారు. కానీ.. సరిగ్గా అంచనా వేయడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు. కాబట్టి ఎప్పటికప్పుడూ గ్యాస్ సిలిండర్ పరిమాణాన్ని చెక్ చేస్తుండాలి. ఇందుకు మీరు శ్రమించాల్సిన పని లేదు. మేము చెప్పే ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా మీ గ్యాస్ బండలో ఎంత గ్యాస్ ఉందనేది తెలుసుకోవచ్చు. దాంతో అయిపోవడానికి ముందే బుక్ చేసుకోవచ్చు. ఇంతకీ ఎలా చెక్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
మీరు వంటగ్యాస్ కేవైసీ కోసం ఏజెన్సీకి పరిగెడుతున్నారా? - ఇంట్లో నుంచే ఈజీగా ఇలా పూర్తి చేయండి!
తడి వస్త్రంతో..మీ గ్యాస్ సిలిండర్ అయిపోయిందో లేదో తెలుసుకోవడానికి.. ముందుగా మీరు ఒక టవల్ లేదా క్లాత్ ను తీసుకోవాలి. దానిని వాటర్‌లో తడిపి పిండాలి. అప్పుడు దానిని గ్యాస్ బండ చుట్టూ చుట్టాలి. అలా కొంతసేపు ఉంచి.. ఆ తర్వాత క్లాత్‌ను తొలగించాలి. అనంతరం సిలిండర్ మీద కొన్ని సెకన్లకే కొంత భాగం ఆరిపోవడాన్ని, మరికొంత భాగం తడిగా ఉండడాన్ని మీరు చూడవచ్చు. అంటే.. గ్యాస్ లేని ప్రాంతం పొడిగా, ఉన్న ప్రాంతం తడిగా ఉంటుంది. ఇక తడిగా ఉన్న ప్లేస్ కూడా ఎండిపోతుంటే.. గ్యాస్ అయిపోయినట్లుగా మీరు అనుకోవాలి. ప్రతి 2-3 రోజులకు ఈ విధంగా మీరు ఈ ట్రిక్‌ను యూజ్ చేసి గ్యాస్ బండలో గ్యాస్ పరిమాణాన్ని తెలుసుకోవచ్చు.
మరో అదిరిపోయే ట్రిక్ ఏంటంటే.. ముందుగా మీరు ఒక గ్లాస్ గోరు వెచ్చని వాటర్ తీసుకోవాలి. ఆ నీటిని గ్యాస్ బండపై నుంచి కిందకు పోయాలి. గ్యాస్ విడుదలయ్యే పైప్ దగ్గర మాత్రం అస్సలు పోయకండి. ఇలా మీరు బండపై వాటర్ పోశాక.. పైనుంచి కింది వరకు అక్కడక్కడా చేత్తో తడిమి చూస్తే, కొంత భాగం వేడిగా అనిపిస్తుంది. అలాగే కిందకు వస్తే మరికొంత భాగం కూల్‌గా అనిపిస్తుంది. ఎక్కడైతే వేడిగా ఉందో.. అక్కడి వరకు గ్యాస్ అయిపోయిందని అర్థం. ఎక్కడైతే కూల్‌గా ఉందో.. అక్కడి నుంచికింది వరకు ఇంకా గ్యాస్ ఉందని అర్థం. ఈ ట్రిక్ కోసం గోరువెచ్చని నీటిని మాత్రమే యూజ్ చేయాలి.
గ్యాస్ సిలిండర్‌కు ఎక్స్పైరీ డేట్- ఎలా చెక్ చేయాలో తెలుసా?
How to Apply for Indane Gas New Connection : ఇండేన్ గ్యాస్ కొత్త కనెక్షన్ కావాలా..? ఆన్లైన్లో ఇలా అప్లై చేయండి!