తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 10:52 AM IST

ETV Bharat / bharat

How To Add Bank Account In Google Pay: గూగుల్ పేలో బ్యాంక్ ఖాతా ఇలా యాడ్ చేయండి.. పిన్ అలా ఛేంజ్ చేయండి..

How To Link Bank Account With Google Pay: మీరు గూగుల్ పే యాప్‌ వాడుతున్నారా..?, యాప్‌లో మీ కొత్త బ్యాంక్ ఖాతాను ఎలా జోడించాలని వెతుకుతున్నారా..? అయితే, ఈ స్టోరీలోని మార్గాలను చదివేసి, ఈజీగా బ్యాంక్ ఖాతాను యాడ్ చేయండి.. పిన్ నెంబర్‌ ఛేంజ్ చేసుకోండి.

Bank Account Add
How To Add Bank Account With GPay

How To Add Bank Account With GPay:గూగుల్‌కు చెందిన చెల్లింపు సేవల సంస్థ 'గూగుల్‌ పే (Google Pay)' అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ యాప్‌‌లలో ఇది ఒకటి. ఈ యాప్.. తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ యాప్ ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) చెల్లింపులను చాలా సులభంగా, సురక్షితంగా చెల్లించుకోవచ్చు. రైలు, విమాన టిక్కెట్‌లు మొదలుకొని కూరగాయల వరకూ ఈ యాప్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. అయితే, గూగుల్ పే (GPay)లో బ్యాంక్ ఖాతాను జోడిస్తేనే ఈ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. మరి, గూగుల్ పేలో బ్యాంకు అకౌంట్‌ను ఎలా యాడ్ చేయాలి..?, గూగుల్ పే UPI పిన్‌ని ఎలా మార్చాలి..?, పాత బ్యాంక్ ఖాతాను ఎలా తొలగించాలి..? Google Pay పిన్‌ని ఎలా మార్చాలి..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్ పేలో బ్యాంక్ ఖాతా జోడించటం ఎలా..?
How to Add Bank Account in Google Pay:

  • ముందుగా వినియోగదారులు Google Payని యాక్టివేట్ చేయాలి.
  • ఆ తర్వాత ప్రొఫైల్ చిత్రంపై క్లిక్ చేయాలి.
  • బ్యాంక్ ఖాతాను జోడించే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • జాబితా నుండి మీకు ఏ బ్యాంకులో ఖాతా ఉందో ఆ బ్యాంకును ఎంపిక చేసుకోవాలి.
  • ఒకవేళ మీ బ్యాంక్‌ను గుర్తించకపోతే Google Pay పని చేయదు.
  • మీ ఖాతా ధృవీకరించబడిన తర్వాత తప్పనిసరిగా డెబిట్ కార్డ్ సమాచారాన్ని నమోదు చేయాలి.
  • ఆ తర్వాత బ్యాంక్ ఖాతా గూగుల్ పేలో యాడ్ అవుతుంది.

UPI Money Sent To Wrong Recipient? What next? : పొరపాటున వేరే వ్యక్తికి డబ్బు పంపిస్తే.. ఏం చేయాలి?

UPI పిన్‌ని ఆన్-స్క్రీన్‌పై మార్చడం ఎలా..?
How to change UPI PIN on-screen: గూగుల్ పేలోఒకవేళ ఇప్పటికే మీరు UPI పిన్‌ని సెట్ చేసి ఉన్నట్లయితే దాన్ని మరోసారి నమోదు చేయాలి. ఒకవేళ PINని మరచిపోయినట్లయితే REMOVE PIN అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆ తర్వాత కొత్త UPI పిన్‌ని నమోదు చేసుకోవాలి.

బ్యాంక్ ఖాతాను మార్చటం, తొలగించాలి ఎలా..?
How to change or delete bank account:

  • ముందుగా మీ Google Pay ఖాతాను తెరవండి.
  • రైట్ కార్నర్​లో ఉన్న మీ ప్రొఫైల్ ఫొటో బ్యాంక్ ఖాతాపై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత మీ ఖాతా తీసివేయబడుతుంది.
  • ఆ తర్వాత పాత ఖాతా స్థానంలో కొత్త ఖాతాను యాడ్ చేయండి.

Personal loan on Google Pay: మీ ఫోన్‌లో గూగుల్ పే ఉందా.. అయితే, మీకు లక్ష దాకా రుణం వచ్చేసినట్టే..!

గూగుల్ పేలో పిన్‌ మార్చటం, రీసెట్ చేయటం ఎలా..?
How to change and reset pin in google pay:

  • ముందుగా మీ మొబైల్‌లో మీ Google Pay ఖాతాను తెరవండి.
  • మీ ప్రొఫైల్ చిత్రంపై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత బ్యాంక్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • పిన్ ఛేంజ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, కొత్త పిన్‌ను నమోదు చేయండి.
  • అదే UPI పిన్‌ని మళ్లీ టైప్ చేయండి.
  • మీ PINని రీసెట్ చేయండి.
  • UPI PINని మూడు సార్లకంటే ఎక్కువసార్లు నమోదు చేయొద్దు.
  • అలా చేస్తే మరొక లావాదేవీ కోసం 24 గంటలు వేచి ఉండాలి.
  • ఆ సమయంలో డబ్బు పంపబడదు, స్వీకరించబడదు.

డెబిట్ కార్డ్ లేకపోయినా UPI యాక్టివేషన్​.. ప్రాసెస్ ఇలా..

ABOUT THE AUTHOR

...view details