తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోంలో ఫలించిన మోదీ-షా 'మ్యాజిక్​' - అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

2021 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ముఖ్యంగా భావించిన అసోం పోరులో భాజపా విజయం సాధించింది. ప్రభుత్వ వ్యతిరేకత, ఎన్​ఆర్​సీ సంబంధిత సవాళ్లను అధిగమించి.. ఆధిక్యాన్ని కైవసం చేసుకుంది.

bjp in assam
అసోంలో భాజపా

By

Published : May 2, 2021, 7:12 PM IST

Updated : May 2, 2021, 10:21 PM IST

అసోంలో మరోమారు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అధికారం నిలబెట్టుకుంది భాజపా. ఈ ఈశాన్య రాష్ట్రంలో గెలుపొందడం భాజపాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన విషయం. అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు రచించి, ప్రజలను మెప్పించగలిగింది. మరి ఈ వ్యూహాలేంటి? ఇందులో భాజపా పెద్దల పాత్ర ఎంత?

మోదీ-షా హిట్​!

2021 శాసనసభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ- కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. అసోంపై ప్రత్యేక దృష్టి సారించారు అనడంలో సందేహం లేదు. ఎన్నికల వేళ వీరు ఇరువురు రాష్ట్రంలో అనేకమార్లు పర్యటించారు. రాష్ట్ర నలుమూల తిరిగి ప్రచారాలు, ర్యాలీలు భారీ స్థాయిలో నిర్వహించారు. వీరి వ్యూహం ఫలించిందని భాజపాకు దక్కిన సీట్ల సంఖ్యను చూస్తే తెలుస్తుంది.

అసోం భాజపాలో చీలికలు ఉన్నాయని, పెద్దల మధ్య విభేదాలు కూడా ఉన్నాయని.. ఎన్నికల వేళ వార్తలు గుప్పుమన్నాయి. ఈ సమస్య తీవ్రమవ్వక ముందే.. మోదీ-షా పని మొదలుపెట్టారు. అసలు సమస్యే లేదు అన్న విధంగా ఐకమత్యాన్ని చాటి ప్రజల్లోకి వెళ్లారు. ఇది ఒకింత ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించిన విషయమే.

కూటములు సాధించిన సీట్లు..

ఎన్​డీఏ-75

యూపీఏ-50

ఏజేపీ-0

ఇతరులు- 1

ఈశాన్య వారధి...

ఈశాన్యానికి వారధిగా పిలిచే అసోంలో తిరిగి అధికారం చేపట్టడం భాజపాకు ఎంతో ముఖ్యం. యాక్ట్​ ఈస్ట్ పాలసీకి అనుగుణంగా పొరుగు దేశాలతో మైత్రిని బలపరుచుకునేందుకు ఉపయోపడుతుందని.. ఆది నుంచే భారీ ప్రణాళికలు రచించింది భాజపా.

సీఏఏ

పౌరసత్వ చట్టం గురించి గతంలో ఈశాన్యంలో భారీ స్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. అయినప్పటికీ.. సీఏఏపై వెనక్కి తగ్గేది లేదని భాజపా తేల్చిచెప్పింది. ఎన్నికల ప్రచారాల్లో ఈ అంశాన్ని విస్త్రతంగా వినియోగించింది. ఇది హిందువల్లో బలమైన మెజారిటీని రాబట్టగలిగిందన్నది ఫలితాల ద్వారా తెలుస్తోంది.

తేయాకు కార్మికులు...

అసోం అంటే ముందుగా గుర్తొచ్చేది తేయాకు కార్మికులు. వీరిని మెప్పించేందుకు అన్ని పార్టీలు తీవ్ర స్థాయిలో కృషి చేశాయి. భాజపా కూడా తన అస్త్రాలకు పదునుపెట్టింది. దాదాపు 40 స్థానాల్లో బలంగా ఉన్న తేయాకు కార్మికులకు నెలకు రూ. 3వేలు చొప్పున ఇస్తామని హామీనిచ్చి.. వారి మనసు దోచుకుంది. ప్రధాని మోదీ.. ఒక అడుగు ముందుకేసి.. తన 'టీ' నేపథ్యాన్ని ప్రస్తావించి వారిలో ఒకరిగా కలిసిపోయారు.

అసోంలో కమల వికాసానికి ప్రధాన కారణాలు

మిత్రపక్షాలతో..

ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అసోం గణపరిషత్‌ (ఏజీపీ), యునైటెడ్‌ పీపుల్స్‌ పార్టీ లిబరల్‌(యూపీపీఎల్​), గణ సురక్ష పార్టీ(జీఎస్​పీ)తో కలిసి పోటీ చేసింది. అయితే అసోం గణపరిషత్​ బలహీనపడిన నేపథ్యంలో.. యూపీపీఎల్​తో వ్యూహాత్మక బంధాన్ని ఏర్పరచుకుని విజయం సాధించింది భాజపా.

ఇదీ చూడండి:అసోంలో అధికార పీఠం దక్కేదెవరికి?

ఎగ్జిట్​పోల్స్​:ఎగ్జిట్​పోల్స్​: అసోంలో రెండోసారి భాజపా జయకేతనం!

Last Updated : May 2, 2021, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details