తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (16-12-2021): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - horoscope today telugu

Horoscope Today: ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
రాశి ఫలం

By

Published : Dec 16, 2021, 4:18 AM IST

Horoscope Today: ఈరోజు (16-12-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; దక్షిణాయనం హేమంత రుతువు; మార్గశిర మాసం; శుక్లపక్షం

త్రయోదశి:తె. 4.27 తదుపరి చతుర్దశి

భరణి:ఉ. 8.41 తదుపరి కృత్తిక

వర్జ్యం:రా. 9.50 నుంచి 11.35 వరకు

అమృత ఘడియలు:లేవు

దుర్ముహూర్తం:ఉ. 10.05 నుంచి 10.49 వరకు తిరిగి మ. 2.28 నుంచి 3.12 వరకు

రాహుకాలం:మ. 1.30 నుంచి 3.00 వరకు

సూర్యోదయం:ఉ.6.26, సూర్యాస్తమయం: సా.5-24

ధనుస్సంక్రమణంమ. 12.26

మేషం

ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. శ్రీవేంకటేశ్వర దర్శనం శుభప్రదం.

వృషభం

ప్రారంభించబోయే పనులకు ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. అకారణ కలహ సూచన. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

మిథునం

శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. సాయిబాబా వారి సచ్చరిత్ర పారాయణ శుభాన్ని చేకూరుస్తుంది.

కర్కాటకం

లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

సింహం

ప్రారంభించబోయే పనుల్లో పట్టుదల వదలకండి. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.

కన్య

మనసు పెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

తుల

ధర్మసిద్ధి ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురుశ్లోకం చదవాలి.

వృశ్చికం

సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని మధురక్షణాలను గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామం చదవాలి.

ధనుస్సు

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. తోటివారి సహకారం ఉంటుంది. సమయానికి ఆహారం, విశ్రాంతి తీసుకోవాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన శ్రేయోదాయకం.

మకరం

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా తెలివిగా పరిష్కరిస్తారు. వృథా ప్రసంగాలతో సమయాన్ని వృథా చేయకండి. మీ పై అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. దుష్టులను దరిచేరనీయకండి. ఈశ్వర సందర్శనం ఉత్తమఫలితాన్ని ఇస్తుంది.

కుంభం

సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. గొప్పవారిని కలుస్తారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆదిత్య హృదయం చదవాలి.

మీనం

అవరోధాలు ఉన్నా ఆత్మబలంతో పోరాడి విజయం సాధిస్తారు. ధనధాన్యాభివృద్ధి ఉంది. మాట పట్టింపులకు పోకండి. మొహమాటం వల్ల లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోకండి. ఎవరినీ అతిగా నమ్మకండి. విష్ణుసహస్రనామ స్తోత్రం చదివితే మంచిది.

ఇదీ చూడండి:Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (డిసెంబర్‌ 12 - డిసెంబర్‌ 18)

ABOUT THE AUTHOR

...view details