తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - రాశి ఫలాలు తెలుగులో

Horoscope Today: ఈ రోజు(నవంబర్​​ 25) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope-today-telugu-november-25-friday
horoscope-today-telugu-november-25-friday

By

Published : Nov 25, 2022, 6:12 AM IST

Horoscope Today: ఈ రోజు(నవంబర్​​ 25) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

ఓర్పుతో ముందుకు సాగితే శుభఫలితాలు ఉంటాయి. మీ మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. ఆలోచించి మాట్లాడాలి లేకపోతే అపకీర్తిని మూటకట్టుకుంటారు. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. శ్రీరామ రక్షా స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది.

శుభకాలం. ప్రారంభించిన పనులను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో అతి చనువు వద్దు. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ సందర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది

మనోధైర్యంతో ప్రయత్నించి కార్యక్రమాలను సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి.బంధుమిత్రులను కలుస్తారు. రుణబాధ ఎక్కువ. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివాష్టకం చదివితే మంచిది.

సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.

ప్రారంభించిన పనులను ప్రణాళికతో పూర్తిచేయగలుగుతారు. అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. విందు వినోదాలతో కాలం గడుస్తుంది. లక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం.

సంకల్పాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల్లో తగుజాగ్రత్తలు అవసరం. ఇష్టదైవారాధన శుభప్రదం.

పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. హనుమత్ ఆరాధన శుభప్రదం.

ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బిల్వాష్టకం చదివితే బాగుంటుంది.

వృత్తి,వ్యాపారాల్లో అనుకూలత ఉంది. ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. కీలక వ్యవహారాల్లో తోటివారి సహకారం తీసుకోవడం మంచిది. ద్వాదశ చంద్ర దోషం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మనోబలం కోసం దుర్గాఅష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

యశోవృద్ధి కలదు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. శ్రీవేంకటేశ్వరుడిని పూజిస్తే మంచిది.

బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థికలాభం పొందుతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మసిద్ధి ఉంది. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు. సంకటహర గణపతి స్తోత్రం చదివితే బాగుంటుంది.

ABOUT THE AUTHOR

...view details