Horoscope Today : ఈ రోజు మీ రాశి ఫలాలు చూసుకున్నారా? - telugu panchangam
Horoscope Today : ఈ రోజు (మే 5) మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Horoscope Today
By
Published : May 5, 2023, 6:14 AM IST
Horoscope Today : ఈ రోజు (మే 5) మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మీ సామజిక సంబంధాల నుంచి ప్రయోజనం పొందుతారు. భిన్న రంగాలలోని నిపుణుల నుండి వచ్చే పొగడ్తలు మీకు ప్రశాంతత చేకూరుస్తాయి. మేధోపరమైన చర్చలు మీకు కుతూహలం కలిగిస్తాయి. ఇతరులతో మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మీ మృదువైన స్వభావం నుంచి ప్రతిఫలాలు పొందుతున్నారు. సరదాగా గడపండి. ఇతరుల గురించి ఆందోళన చెందడం ఆపండి. మీ పని మీరు చూసుకోవాలని నిర్ణయించుకుంటే మీకు మానసిక స్థిరత్వం, స్పష్టత, ప్రశాంతత ఉంటాయి.
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో ఒడుదొడుకులు మీకు మానసికంగా ఇబ్బంది కలగవచ్చు. ఇష్ట దైవాన్ని ప్రార్థించడం మంచిది.
ఈ రోజు శుభకరమైన రోజు కాదు. మీ మానిసకస్థితి ఘోరంగా ఉంటుంది. ఎక్కడా తప్పు జరిగిందో, నేనేం తప్పు చేశానో అని మీరు ప్రశ్నించుకుంటారు. కుటుంబసభ్యులతో మీరు గొడవపడతారు. ఈ రోజు మీరు డబ్బు పొగొట్టుకునే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ బాధలన్నీ సహనంతో భరించండి. రేపటి రోజు చక్కగా ఉంటుంది.
మీ పని బాగా పూర్తి చేసి పోటీదారులపై విజయం సాధించినప్పుడే మీకు సంతోషం. మీ సన్నిహితులతో మీ సంబంధాలు బాగుంటాయి. మీరు మీ ప్రియమైన వారితోనూ, మీ స్నేహితులతోనూ ట్రిప్‌కు వెళ్లబోతున్నారని ఫలితాలు చెబుతున్నాయి. మీరు ఈ రోజు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆర్థిక సంబంధమైన లాభాలు రావచ్చు. మీరు మానసికంగా గంభీరంగా ఉంటారు. అదృష్టం మీకు కలిసివస్తుంది. ఈ రోజు కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి మంగళకరమైన రోజు.
ఈ రోజు మంగళకరమైన రోజు. మీరు మీ మాటలతో చుట్టుప్రక్కల వారిని ఆకట్టుకుంటారు. మీరు మీ కుటుంబ సభ్యులతో శాంతిగా ఉండవచ్చు. అయినా మీరు కోపం అదుపులో ఉంచుకోవాలి. మీరు ఆర్థిక సంబంధమైన విషయం బాగానే నిర్వహిస్తారు. నెగిటివ్ ఆలోచనలు రానివ్వకండి. మీరు మీ స్నేహితులతోనూ, మీ ప్రియమైన వారితోనూ ట్రిప్‌కు వెళ్లి రావచ్చని ఫలితాలు చెబుతున్నాయి.
మీరు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీరు మీ ఫైనాన్స్ బాగానే మేనేజ్ చేస్తారు. మీరు మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉంటారు. మీరు మీ అభిప్రాయాలను దృఢంగా నమ్మండి. మీరు సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొంటారని ఫలితాలు చెబుతున్నాయి.
ఏదైనా ఆపరేషన్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గొడవకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి మీ శారీరక, మానసిక ఆరోగ్యం కూడా అంత అనుకూలంగా ఉండదు. వినోదాల కోసం మీరు డబ్బు ఖర్చు చేస్తారు. సన్నిహితులు, ప్రియమైన వారితో అపోహలు ఏర్పడతాయి.
ఈ రోజు మీకు లాభదాయకమైన రోజు. మీ కుటుంబ జీవితాన్ని ఈ రోజు సంపూర్ణంగా ఆనందిస్తారు. స్నేహితులతో కలిసి చిన్న ట్రిప్‌కు వెళ్తారు. మీ ఆదాయంలో పెరుగుదల ఉందని గ్రహస్థితి చెప్తోంది. మీకు నచ్చిన ఆహారాన్ని మీరు ఈ రోజు భుజిస్తారు.
వ్యాపారం సాధారణంగా ఉండాల్సినంతగా ఉండదు. ఆరోగ్యం కూడా కొంత సమస్యాత్మకంగా ఉంటుంది. చిన్న యాక్సిడెంట్ జరిగే సూచన ఉన్నది. ప్రమాదకరమైన వ్యవహారాలు, సందర్భాలకు దూరంగా ఉండటం మంచిది. అదే సమయంలో ఈ రోజు కొంత సానుకూలత కూడా కనిపిస్తోంది. వ్యాపార అవసరాల కోసం చేసే ప్రయాణం మానుకోండి. దీర్ఘకాలంలో దాని ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు.
ఆరోగ్యం అంతగా సహకరించదు. ఇది మీకు చికాకు కలిగిస్తుంది. అయితే ఇది పనుల విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మీరు పనిలో పూర్తిగా లీనమైపోతారు కాబట్టి అనారోగ్యాన్ని మర్చిపోతారు. కాని ఆ పని మీ ఉన్నతాధికారులకు అంతగా సంతృప్తి కలిగించకపోవచ్చు. బహుశా మీ అనారోగ్యం కారణంగా పనిని మీరు అంత సమర్థవంతంగా చేయలేకపోవచ్చు.
అనైతికమైన కార్యకలాపాలలో ఇరుక్కోవడం మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది. మీరు కోపం అదుపులో ఉంచుకోవాలి. మీరు ఆరోగ్య సంబంధమైన విషయంలో జాగ్రత్త వహించాలి. నెగిటివిటీ మీ వ్యక్తిగత జీవితాన్ని పాడు చేస్తుంది. దాన్ని మనసులోకి కూడా రానివ్వకండి. వైద్య ఖర్చులు పెరుగుతాయని ఫలితాలు చెబుతున్నాయి. మీరు అశాంతిగా ఉంటారు. దానశీలత కలిగి ఉండడం, దైవంపై అచంచల విశ్వాసం కలిగి ఉండడం వల్ల మేలు చేకూరుతుంది.