తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - జాతకం

Horoscope Today : ఈ రోజు రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today
రాశి ఫలాలు

By

Published : Sep 9, 2022, 6:20 AM IST

Updated : Sep 9, 2022, 7:17 AM IST

Horoscope Today : ఈ రోజు(సెప్టెంబరు 9) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. సంతోషకరమైన వార్తలు వింటారు. ఆర్థికంగా లాభాలున్నాయి. హనుమంతుడిని ఆరాధించాలి.

కర్మసిద్ధి ఉంది. ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పని పూర్తి చేయగలుగుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బద్ధకాన్ని దరిచేరనీయకండి. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

మొదలుపెట్టిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలున్నాయి. శివారాధన శుభానిస్తుంది.

మిశ్రమ వాతావరణం కలదు. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరమవుతాయి. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యం కోల్పోవద్దు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. అనవసరంగా ఆందోళనపడతారు. దైవారాధన మానవద్దు.

చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాన్నిస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. వాదులాటలకు దూరంగా ఉండటం మంచిది. శని శ్లోకాన్ని చదవండి.

చేపట్టే పనుల్లో మంచి ఫలితాలు రాబడతారు. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.

చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బందిపెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. గణపతి ఆరాధన శుభప్రదం.

శుభకాలం. మీ మీ రంగాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆరాధన చేస్తే మంచిది.

తలపెట్టిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలున్నాయి. సమయ పాలనతో పనులను పూర్తి చేస్తారు. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.

అనుకున్న ఫలితాలను సాధిస్తారు. కీలక వ్యవహారంలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వడం మంచిది. కోపతాపాలకు పోకండి. మనసు చెడ్డ పనుల మీదకు మళ్లుతుంది. శివాష్టోత్తరం పఠించాలి.

కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా పఠించాలి.

Last Updated : Sep 9, 2022, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details