తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - ఈ రోజు రాశి ఫలాలు

Horoscope Today: ఈ రోజు(సెప్టెంబరు 27) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

HOROSCOPE TODAY SEPTEMBER 27 TUESDAY
HOROSCOPE TODAY SEPTEMBER 27 TUESDAY

By

Published : Sep 27, 2022, 6:24 AM IST

Updated : Sep 27, 2022, 6:33 AM IST

ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తలపెట్టిన పనులు చకచకా పూర్తవుతాయి. మీ ప్రతిభను పెద్దలు పెంచుకుంటారు. అవసరాలకు ధనం చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ చేయడం మంచిది

చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం వలన ఇంటగెలుస్తారు. శివారాధన శుభప్రదం.

శుభ భవిష్యత్తుకోసం ఎక్కువగా కష్టపడాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలున్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సూర్యారాధన మేలుచేస్తుంది.

శ్రమ ఫలిస్తుంది. మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

మంచి భవిష్యత్తుకై వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మనఃస్సౌఖ్యం కలదు. సౌభాగ్య సిద్ధి ఉంది. నలుగురిలో గొప్పపేరు సంపాదిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. లక్ష్మీదర్శనం శుభప్రదం.

బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధిబలంతో ఆపదల నుండి బయటపడతారు. మీ శ్రమ వృథాకాదు. మిత్రుల సహకారం ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. సూర్య ఆరాధన శుభదాయకం.

ధర్మసిద్ధి ఉంది. మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్త్రలాభం ఉంది. ఆర్థికంగా ఎదగడానికి పునాదులను నిర్మిస్తారు. విష్ణు నామాన్ని జపించండి.

ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మొదలుపెట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. స్థిరమైన నిర్ణయాలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. వేంకటేశ్వర శరణాగతి స్తోత్రం పఠించడం మంచిది.

మిశ్రమ వాతావరణం ఉంటుంది. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్ప ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు.

మంచి కాలం. ఏపని మొదలు పెట్టినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. జన్మస్థానంలో చంద్ర బలం అనుకూలంగా ఉంది. కుటుంబ సౌఖ్యం కలదు. ఇష్టదైవ ప్రార్థన మరింత మేలు చేస్తుంది.

ఉద్యోగంలో అనుకూల ఫలితాలున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

Last Updated : Sep 27, 2022, 6:33 AM IST

ABOUT THE AUTHOR

...view details