తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - శంకరమంచి శివసాయి శ్రీనివాస్ రాశి ఫలాలు

Horoscope Today : ఈ రోజు(సెప్టెంబరు 23) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today
రాశి ఫలాలు

By

Published : Sep 23, 2022, 6:27 AM IST

Horoscope Today : ఈ రోజు(సెప్టెంబరు 23) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

మిశ్రమ కాలం నడుస్తోంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తి పడకపోవచ్చు. అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.

ప్రారంభించిన పనుల్లో చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బుద్ధిబలంతో అందర్నీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవారాధన శ్రేయస్కరం.

సమయానుకూలంగా ముందుకు సాగండి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీ సందర్శనం ఉత్తమం.

శుభసమయం. మీమీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు.

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం.

ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యం ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన మంచిది.

మిశ్రమ కాలం. మీమీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. గిట్టని వారితో మిత భాషణం ఉత్తమం. స్థానచలనం సూచితం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.

మిశ్రమ కాలం. మీమీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. గిట్టని వారితో మిత భాషణం ఉత్తమం. స్థానచలనం సూచితం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.

ప్రారంభించిన పనులను సులభంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మీ దేవి సందర్శనం ఉత్తమం.

పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈశ్వర ఆరాధన శుభప్రదం.

అనుకున్నది సాధిస్తారు. మీమీ రంగాల్లో ఊహించిన ఫలితాలు వస్తాయి. కలహాలకు దూరంగా ఉండాలి. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్య హృదయ పారాయణ చేస్తే బాగుంటుంది.

శ్రమ ఫలిస్తుంది. మొదలుపెట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసమును పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్ట దైవారాధన మంచిది.

ABOUT THE AUTHOR

...view details