Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకున్నారా? - ఈ రోజు మీ రాశి ఫలం
Horoscope Today: ఈ రోజు(అక్టోబర్ 15) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
horoscope news
By
Published : Oct 15, 2022, 6:20 AM IST
Horoscope Today: ఈ రోజు(అక్టోబర్ 15) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
శుభఫలితాలున్నాయి. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఈశ్వర సందర్శనం చేస్తే మంచి జరుగుతుంది.
చేపట్టే పనుల్లో శ్రద్ధ బాగా అవసరం. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. ముఖ్య విషయాల్లో బంధుమిత్రుల సలహాలు అవసరమవుతాయి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. శ్రీ లక్ష్మి గణపతి ధ్యానం శుభప్రదం.
శ్రమఫలిస్తుంది. కార్యసిద్ధి ఉంది. ఆర్థిక వ్యవహారాలలో మంచిఫలాలను అందుకుంటారు. మాతృసౌఖ్యం ఉంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
శ్రమ పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉత్సాహంగా పనిచేయాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
తలపెట్టిన కార్యాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. మీ పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేయకండి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
చేసే పనుల్లో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులను మెప్పించడానికి కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. శివ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందగలరు.
శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. దుర్గాస్తుతి పఠించాలి.
మానసికంగా ద్రుఢంగా ఉంటారు. మంచేదో చెడేదో తెలుసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. దుర్గాస్తుతి చేయడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు.
ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచినిస్తాయి, మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి.
కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. మీ మీ రంగాల్లో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగి మంచి ఫలితాలు సాధిస్తారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.