తెలంగాణ

telangana

By

Published : Oct 10, 2022, 6:05 AM IST

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today: ఈ రోజు(అక్టోబర్​ 10) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today
horoscope today

Horoscope Today: ఈ రోజు(అక్టోబర్​ 10) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

మధ్యమ ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకొని పోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.

కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. సాయి చరిత్ర పారాయణ చేయడం మంచిది.

చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపించాలి.

అనుకూల ఫలితాలున్నాయి. ఆస్తిని వృద్ధిచేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం కలదు. కీలక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

చేపట్టే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధికమిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సూర్య ఆరాధన శుభప్రదం.

మధ్యమ ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ముఖ్య విషయాల్లో ముందుగానే స్పందించండి. గణపతి సహస్రనామ పారాయణం మంచిది.

మీ ఓర్పుకు ఇది పరీక్షా కాలం. మీ మీ రంగాల్లో ఆచితూచి అడుగువేయాలి. ఆలోచించి మాట్లాడాలి లేనియడల అపకీర్తిని మూటకట్టుకుంటారు. ప్రణాళిక ద్వారా విజయం సాధిస్తారు. శ్రీరామరక్ష స్తోత్రం చదివితే మంచిజరుగును.

మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధనధాన్య లాభాలుంటాయి. ఉద్యోగంలో ఉన్నతిని సాధిస్తారు. తోటి వారి సహకారంతో సత్ఫలితాలను సాధిస్తారు. ఎట్టి పరిస్థితిలోనూ మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లక్ష్మీనామాన్ని జపించడం ఉత్తమం.

శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. నీరసించకుండా పనిచేస్తే గొప్ప ఫలితాలు సాధిస్తారు. శతృవులపై నైతిక విజయం సాధిస్తారు. ముఖ్య విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే వివాదాలు చుట్టుముడతాయి. చెడు సహవాసం వల్ల మనోవిచారం కలుగుతుంది. ఎవ్వరినీ అతిగా నమ్మకండి. శనికి తైలాభిషేకం శుభప్రదం.

పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలని పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. సాయి బాబా సందర్శనం శుభప్రదం.

విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. బద్ధకించకుండా ప్రయత్నం చేయండి. అనుకూల ఫలితాలు సొంతమవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. పెద్దలయందు గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

బుద్ధిబలంతో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. విందువినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. మిత్రులవల్ల మేలు జరుగుతుంది. శివారాధన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details