తెలంగాణ

telangana

ETV Bharat / bharat

HOROSCOPE TODAY: ఈరోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే? - ఈరోజు రాశిఫలాలు

HOROSCOPE TODAY: ఈరోజు (నవంబరు 4) మీ రాశిఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today november 4 thursday
horoscope today november 4 thursday

By

Published : Nov 4, 2022, 6:18 AM IST

Updated : Nov 4, 2022, 7:31 AM IST

HOROSCOPE TODAY:

మేషం:ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది.

వృషభం:తోటివారిని కలుపుకొనిపోతే పనులు త్వరగా పూర్తవుతాయి. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. శివారాధన శుభప్రదం.

మిథునం:మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఒక సంఘటన లేదా వార్త కాస్త బాధ కలిగిస్తుంది. శనిధ్యానం శుభకరం.

కర్కాటకం: ముఖ్య వ్యవహారంలో పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కీలక విషయాల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. ఆదిత్య హృదయం చదవటం శుభప్రదం.

సింహం: ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు.శని ధ్యానం చదవాలి.

కన్య: కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. బుద్దిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

తుల: కుటుంబసభ్యుల మాటకు విలువ ఇవ్వండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు. శివారాధన శుభాలను అందిస్తుంది.

వృశ్చికం: కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. బంధువులతో మాటపట్టింపులకు పోవద్దు. శని శ్లోకం చదవాలి.

ధనుస్సు: మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. ధర్మసిద్ధి ఉంది. ముఖ్యమైన విషయాల్లో సొంతనిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. విష్ణు సందర్శనం శుభప్రదం.

మకరం: ప్రారంభించిన పనుల్లో ఆశించిన ఫలితాలను రాబట్టడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. భోజన నియమాలను పాటించడం ఉత్తమం. శ్రీవారి దర్శనం శుభకరం.

కుంభం: మంచి కాలం. ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు.కుటుంబ సౌఖ్యం కలదు. ఇష్టదైవ ప్రార్ధన మరింత మేలు చేస్తుంది.

మీనం: మధ్యమ ఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. దైవారాధన మానవద్దు..

Last Updated : Nov 4, 2022, 7:31 AM IST

ABOUT THE AUTHOR

...view details