HOROSCOPE TODAY : ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - రాశిఫలాలు నవంబర్ 15
HOROSCOPE TODAY : ఈరోజు (నవంబర్ 15) మీ రాశిఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
horoscope today november 15 tuesday
By
Published : Nov 15, 2022, 6:31 AM IST
HOROSCOPE TODAY : ఈరోజు (నవంబర్ 15) మీ రాశిఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతోఆనందంగా గడుపుతారు. ఇష్టదేవత స్మరణ శుభాన్నిస్తుంది.
ఒక వ్యవహారంలో పెద్దల సహకారం అందుతుంది. ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.
శుభ సమయం. మొదలుపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాదన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు.
మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి మంచి జరుగుతుంది.
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలను సంప్రదించకుండా తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. దుర్గాదేవిని ఆరాధించడం వలన అంతా బాగుంటుంది.
శ్రమ ఫలిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. కలహాలు సూచితం. తోటివారిని కలుపుకు పోవడం ఉత్తమం. గణేశ అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి.
ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధుమిత్రులను ఆదరిస్తారు. కానీ, వాళ్లు మిమ్మల్ని నమ్మంచి మోసం చేసే అవకాశం ఉంది. అనవసర అంశాలకై ఎక్కువ సమయాన్ని కేటాయించకండి. ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి. లక్ష్మీఅష్టోత్తరం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అష్టమ చంద్ర దోషం ఉంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. లలితా సహస్రనామ పారాయణ చేయడం..
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆశించిన ఫలితాలను రాబట్టడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సమయపాలన పాటించండి. బలమైన ఆహారం, విశ్రాంతి అవసరం అవుతాయి. ప్రయాణాలలో ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీరామనామాన్ని జపించండి.
అభివృద్దికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. భోజన సౌఖ్యం ఉంది. ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది
చేపట్టిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆంజనేయ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.