తెలంగాణ

telangana

ETV Bharat / bharat

HOROSCOPE TODAY : ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?

HOROSCOPE TODAY : ఈరోజు (నవంబర్ 14) మీ రాశిఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today november 14  monday
horoscope today november 14 monday

By

Published : Nov 14, 2022, 6:24 AM IST

HOROSCOPE TODAY: ఈరోజు (నవంబర్ 14) మీ రాశిఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

మధ్యమ ఫలితాలున్నాయి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

సకాలంలో పనులను పూర్తిచేస్తారు. బంధుమిత్రులను కలుపుకుపోతారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. ప్రయాణాలు సుఖవంతమవుతాయి. శివుడినీ ఆరాధిస్తే మంచిది.

మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివాష్టకం పఠిస్తే మంచిది.

ఒక ముఖ్య వ్యవహారాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. చేపట్టిన పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద, ఆద్యాత్మిక కార్యక్రమాలలోను పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు

మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుప్రీతి ఉంది. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోదైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.

ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారముంది. నవగ్రహాలను పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.

మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. గిట్టని వారికి దూరంగా ఉండాలి. అన్నదానం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు.

శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేస్తే మంచిది.

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలు పెట్టాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details