తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసా? - రాశి ఫలం ములుగు

Horoscope Today : ఈ రోజు (జనవరి 16) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today
horoscope today

By

Published : Jan 16, 2023, 6:20 AM IST

Horoscope Today : ఈ రోజు (జనవరి 16) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దల సాయం అందుతుంది. అనుకోని సంఘటనలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదేవత స్తోత్రం చదివితే బాగుంటుంది.

కార్యసిద్ధి ఉంది. తలపెట్టిన పనిలో ముందుచూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచి పేరు సంపాదిస్తారు. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

చేపట్టినపపనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరవాత ఇబ్బందులు పడతారు. సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

శుభకాలం. మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధిబంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. శ్రీ మహాగణపతి ఆరాధన చేస్తే మంచిది.

పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచితం. శ్రమ అధికమవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. దుర్గ అష్టోత్తరం చదివితే మంచిది.

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకుసాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.

శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

మిశ్రమ వాతారణం కలదు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. లక్ష్మీదేవి సందర్శనం శుభాన్నిస్తాయి.

మీ మీ రంగాల్లో విజయసిద్ధి ఉంది. ఒక విషయంలో మనః సంతోషాన్ని పొందుతారు. ఆర్థికపరంగా మేలు జరుగుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధనా శుభప్రదం.

మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉత్సాహవంతంగా వాతావరణం ఉంటుంది. ఇష్టదైన ప్రార్థన చేయడం ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు.

మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్తపడాలి. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చలు వస్తాయి. నిర్ణయాలలో స్తిరత్వం ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి. శనిశ్లోకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

ABOUT THE AUTHOR

...view details