తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసా? - రాశిఫలం

Horoscope Today : ఈ రోజు (జనవరి 17) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today
horoscope today

By

Published : Jan 17, 2023, 6:38 AM IST

Horoscope Today : ఈ రోజు (జనవరి 17) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. రామ నామ జపం శ్రేయోదాయకం.

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయాన్ని వృథా చేయకండి. ఇష్టదేవత ఆరాధన శుభప్రదం.

మిశ్రమకాలం. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మనఃపీడ ఉంటుంది. మనోబలం కోసం దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

చిత్తశుద్ధితో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోరాదు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయాన్ని వృథా కానీయకండి. నవగ్రహ ధ్యానం శుభకరం.

సంతోషకరమైన వార్తలు వింటారు. శరీర సౌఖ్యం ఉంది.బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజనసౌఖ్యం ఉంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కలహ సూచన ఉంది కాబట్టి మాట విలువను కాపాడుకోవాలి. హనుమత్ ఆరాధన శుభకరం.

ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. లింగాష్టకం చదివితే బాగుంటుంది.

మీ మీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. అందరినీ కలుపుకొనిపోవడం ఉత్తమం. శ్రీసూక్తం విన్నా, చదివినా మంచి ఫలితాలు సాధిస్తారు.

గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. బుద్ధిబలం బాగుండటం వలన కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

ధర్మసిద్ధి ఉంది. సమస్యలు తొలగి కుదురుకుంటారు. భోజన సౌఖ్యం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదివితే బాగుంటుంది.

మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్త. అనవసర కలహం సూచితం. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శనిజపం అనుకూలతను ఇస్తుంది.

మిశ్రమ కాలం. ముఖ్యమైన పనులను కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. దుర్గాదేవి, వేంకటేశ్వరుని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

ABOUT THE AUTHOR

...view details