తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today : ఈ రోజు రాశి ఫలం(డిసెంబరు 28) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today in telugu
horoscope today in telugu

By

Published : Dec 28, 2022, 6:24 AM IST

Horoscope Today : ఈ రోజు రాశి ఫలం(డిసెంబరు 28) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్థిరమైన నిర్ణయాలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రయాణ సౌఖ్యం ఉంది. శ్రీలక్ష్మీ అష్టోత్తరం చదవడం శుభప్రదం.

అభివృద్ధికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. లక్ష్మీదేవిని ఆరాధిస్తే బాగుంటుంది.

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.

ఇప్పటికే ప్రారంభించిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని విషయాలు ఒత్తిడిని పెంచుతాయి. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగండి. మేలు జరుగుతుంది. దైవారాధన మనశ్శాంతిని కలిగిస్తుంది. దుర్గారాధన శుభప్రదం.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. బుద్ధిబలం బాగుండటం వల్ల కీలక సమయాలలో సమయోచితంగా స్పందించి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మనఃస్సౌఖ్యం ఉంటుంది. యశస్సు వృద్ధి చెందుతుంది. గోసేవ చేస్తే బాగుంటుంది.

మీరు చేసే పనిలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. రవి ధ్యాన శ్లోకం చదివితే మేలు.

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఒక శుభవార్త వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధు,మిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

గ్రహబలం బాగుంది. మీకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

మంచి పనులు చేయడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీలక్ష్మీ స్తోత్రం చదివితే మంచిది.

ప్రారంభించిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. సౌభాగ్యసిద్ధి కలదు. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details